Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 39
39
ఏషా తే భిహితా సాంఖ్యే
బుద్ధిర్యోగే త్విమాం శృణు |
బుద్ధ్యాయుక్తో యయా పార్థ
కర్మబంధం ప్రహాస్యసి ||

తాత్పర్యము : ఇంతవరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యముననుసరించి నీకు వివరించినతిని. ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మ రూపమన వివరించెను అలకింపము. ఓ పృథకుమారా ! అట్టి జ్ఞానముననుసరించి నీవు వర్తింతువేని కర్మబంధము నుండి విడివడగలవు.

భాష్యము : ఇప్పటి వరకూ శ్రీ కృష్ణుడు శరీరము, ఆత్మయొక్క స్థితిగతుల గురించి అర్జునునికి విపులముగా వివరించెను. ఆత్మశాశ్వతమని, తన తాతగారిని సంహరించుట ద్వారా ఆత్మ సంహరింపబడదని నిరూపించెను. ఆత్మ, శరీరము యొక్క ఈ విధమైన విశ్లేషణాత్మక అధ్యయనమునే ‘సాంఖ్య యోగమని’ ఇక్కడ తెలుపబడినది. అయితే దీనికి నాస్తికుడైన కషిలునికి ఎటువంటి సంబంధము లేదు. అతనికంటే ఎంతో ముందే కృష్ణుని అవతారమైన కపిల భగవానుడు అవతరించి తన తల్లి అయిన దేవహూతికి సాంఖ్యతత్త్వముు భోదించెనని శ్రీమద్భాగవతమున తెలుపబడినది.

ఇప్పుడు కృష్ణుడు అర్జునునికి బుద్ధియోగము లేదా కర్మయోగము అనగా భగవంతుని ప్రసన్నార్థము ఎలా భగవత్సేవను సాధన చేయవచ్చునో తెలుపనున్నాడు. భగవద్గీత 10వ అధ్యాయము 10వ శ్లోకము నందు, ఎవరైతే భగవంతుని పట్ల ప్రేమతో సదా భగవత్సేవలో నియుక్తులై ఉందురో వారు భగవంతుని ఆనందదాయక సామ్రాజ్యాన్ని చేరుకొనుటకు భగవంతుడే తగిన జ్ఞానమును వారికి ప్రసాదించునని తెలుపబడినది. కాబట్టి అంతిమముగా భక్తియోగమే లక్ష్యముగా చెప్పిన శ్రీ కృష్ణుని బోధనలకు, కపిల భగవానుని బోధనలకు వ్యత్యాసము లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement