Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 34
34
అకీర్తిం చాపి భూతాని
కథయిష్యంతి తే వ్యయామ్‌ |
సంభావితస్య చాకీర్తి:
మరణాదతిరిచ్యతే ||

తాత్పర్యము : జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడును చెప్పుకొందురు. గౌరవనీయుడైనవానికి అపకీర్తి యనునది మరణము కన్నను దారుణమైనది.

భాష్యము : శ్రీకృష్ణుడు అర్జునుని స్నేహితునిగా, తత్వము తెలిసిన వాడిగా అర్జునుడు యుద్ధము చేయను అన్నదానికి తన తుది నిర్ణయమును ఇక్కడ వెల్లడిచేస్తూ ఉన్నాడు. ”అర్జునా! నీవు యుద్ధము మొదలు కూడా కాకుండానే వెళ్ళిపోయినట్లయితే అందరూ పిరికివాడని నవ్వుల పాలు చేయుదురు. వారేమనుకుంటే నాకేమిటి, నా జీవితాన్ని కాపాడుకుంటాను కదా అనుకోవచ్చేమో అయితే ఎంతో కీర్తి గల నీకు అపకీర్తి భరించరానిది. జీవచ్ఛవముగా ఎలా జీవించగలవు. కాబట్టి పారిపోయి అట్టి జీవితమును గడుపుటకంటే యుద్ధమున మరణించుము. అలా చేసినట్లయితే కనీసము నా స్నేహమును, నీ కీర్తిని నిలుపుకున్న వాడవగుతావు.” కాబట్టి శ్రీ కృష్ణుని తుది నిర్ణయము అర్జునుడు యుద్ధము చేయుటే మేలు కాని పారిపోవుట కాదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement