Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 23
23
నైనం ఛిందంతి శస్త్రాణి
నైనం దహతి పావక: |
న చైనం క్లేదయంత్యాపో
న శోషయతి మారుత: ||

తాత్పర్యము : ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ఛేదింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండింపబడదు.

భాష్యము : మన శాస్త్రజ్ఞులకు తెలిసిన అణ్వాయుధాలే కాక, వేరు వేరు భౌతిక మూలకాలైన భూమి అనగా ఖడ్గాలు, నీరు అనగా వర్షపు ఆయుధాలు, గాలి అనగా సుడిగాలుల వంటి ఆయుధాలు, కూడా ఉన్నాయని మనకు అర్ధమగుచున్నది. ఏది ఏమైనప్పటికీ ఆత్మ వీటిచే ఖండింపబడదు లేదా నశింపబడదు, మాయావాద తత్త్వాన్ని విశ్వసించే వారు ఆత్మ ఏ విధముగా ఏర్పడినదో, మాయచే ఎలా భ్రాంతి చెందినదో వివరించలేరు. ఇక్కడ భగవద్గీతలోనే కాక వరాహపురాణములో కూడా సనాతనులైన జీవులు శాశ్వతముగా భగవంతుని విభిన్నాంశములేనని తెలియజేయటమైనది. ఎలాగైతే అగ్ని కణాలు, అగ్ని లక్షణాన్ని కలిగి ఉన్నా మంటనుండి విడివడినప్పుడు ఆరిపోతాయి. అలాగే జీవరాశులు భగవంతుని సాంగత్యాన్ని మరచినంతనే మాయకు లోనవుతాయి. ముఖ్యముగా అర్జునుడు కృష్ణుని నుండి జ్ఞానాన్ని పొందిన తర్వాత ముక్తుడై కూడా అర్జునునిగానే కొనసాగుటను బట్టి జీవులు కూడా ముక్తి పొందిన తర్వాత కూడా వ్యక్తిత్వాన్ని కొనసాగిస్తారని, భగవంతునిలో లీనము కారని అర్ధమగుచున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement