Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 16
16
నాసతో విద్యతే భావో
నాభావో విద్యతే సత: |
ఉభయోరపి దృష్టో ంత:
త్వనయోస్తత్త్వదర్శిభి: ||

తాత్పర్యము : అసత్తునకు (భౌతీకదేహము) ఉనికి లేదనియు మరియు నిత్యమైన దానికి (ఆత్మ) మార్పు లేదనియు సత్యద్రష్టలైన వారు నిర్ణయంచియున్నారు. ఈ రెండింటితత్రవమును బాగుగా అధ్యయనము చేసి వారీ విషయమును ధృవీకరించిరి.

భాష్యము : శరీరము అనుక్షణమూ మారుచూ ఉంటుంది. శాస్త్రజ్ఞుల ప్రకారము కూడా కణాల సంయోగము, వియోగము వలన శరీరము ఎల్లప్పుడూ మారుతుందని నిరూపించబడినది. కాబట్టి ఎదుగుదల, ముసలితనము శరీరమునకు వచ్చు మార్పులని మనము గమనించవచ్చు. అయితే ఆత్మమాత్రము శరీరము, మనస్సులకు అతీతముగా మార్పు చెందనిదిగా ఉంటుంది. దీనిని తత్త్వ జిజ్ఞాసులైన సాకారులు, నిరాకారులూ ఇద్దరునూ అంగీకరించారు. అయితే భగవంతుని ధామము వీటికి అతీతముగా ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక తేజస్సుతో భాసిల్లుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు తన ఉపదేశముల ద్వారా జీవులలో అజ్ఞానాన్ని తొలగించి సరైన జ్ఞానమును భగవద్గీత ద్వారా ఇచ్చుచున్నాడు. జ్ఞానవంతులు, భగవంతునిలో జీవులు భాగమని, ఎప్పటికీ సమానము కాలేరని అర్థము చేసుకోగలుగుతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement