Friday, November 8, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 03
03
క్లైబం మా స్మ గమ: పార్థ
నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం
త్యక్త్వోత్తిష్ఠ పరంతప ||

తాత్పర్యము : ఓ పృథకుమారా ! పతనకారక చేతకాని తనమునకు లొంగకుము. ఇది నీకు తగదు. ఓ పరంతపా ! ఇట్టిహృదయ దుర్భలతను విడనాడి వెంటనే లెమ్ము.

భాష్యము : కుంతీ పుత్రుడుగా, కృష్ణుని స్నేహితునిగా, ఒక క్షత్రియునిగా తన ధర్మాన్ని నిర్వహించటంలో వెనుకంజ వేసినట్లయితే అది చేతకానితనమే అనబడుతుంది. అంతేకాక భీష్‌ముడు, ద్రోణుడి పట్ల అర్జునునికి గల ఉదారభావము విశల హృదయాన్ని కాక హృదయ బలహీనతను తెలియజేయుచున్నది. క్షత్రియుడు యుద్ధము చేయనట్లయితే అతడు క్షత్రియుడని పేరుకే గాని వాస్తవానికి కాదు. ఈ విధముగా శ్రీకృష్ణుడు భౌతికమైన మమకారాన్ని, అహింసను ప్రశంసించలేదు. శ్రీకృష్ణుని మార్గదర్శకత్వములో అర్జునుడు ఉన్నత విలువలకు ప్రాధాన్యతనిచ్చి యుద్ధము చేయవలెను గాని ఇలా నిరాకరించుట ద్వారా చివరకు అపకీర్తి మాత్రమే మిగులుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement