Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 45
45
యది మామప్రతీకారమ్‌
అశస్త్రం శస్త్రపాణయ: |
ధార్తరాష్ట్రారణ హన్యు:
తన్మే క్షేమతరం భవేత్‌ ||

తాత్పర్యము : నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయనివాడను అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు.

భాష్యము : క్షత్రియ యుద్ధ నియమాల ప్రకారము శత్రువు చేతిలో ఆయుధాలు లేకపోయినా లేదా యుద్ధము చేయుటకు సిద్ధముగా లేకపోయినా అట్టి యోధుడ్ని సంహరింపరాదు. అయితే అర్జునుడు ఎంతకు సిద్ధమైనాడంటే ”వారు నిరాయుధుడనైన నన్ను సంహరించినా సరే గాని నేను మాత్రము యుద్ధము చేయను” అనే నిర్ణయానికి వచ్చెను. ఇవన్నీ అర్జునుని యొక్క భక్తిని తద్వారా అతని కోమల హృదయాన్ని ప్రతిబింపచేయుచున్నవి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement