Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 28
28
అర్జున ఉవాచ
దృష్ట్యేమం స్వజనం కృష్ణ
యుయుత్సుం సముపస్థితమ్‌ |
సీదంతి మమ గాత్రాణి
ముఖం చ పరిశుష్యతి ||

తాత్పర్యము : అర్జునుడు పలికెను : ఓ కృష్ణా ! యుద్ధోత్సాహమున నా యెదుట నిలిచియున్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా శరీరావయవములు కంపించుచున్నవి. నోరు ఎండుపోవుచున్నది.

భాష్యము : భగవంతుడి పట్ల ఏ మాత్రము భక్తి ఉన్నా అటువంటి వ్యక్తి దైవగుణాలను కలిగి ఉంటాడు. నాస్తికులైనవారు ఎంతో ఉన్నత చదువులను చదివి, గొప్ప అర్హతలను కలిగిఉన్నా, వారిలో దైవ లక్షణాలు కొరవడతాయి. అర్జునుడు భక్తుడు కాబట్టి తన బంధువర్గము వారిలో అటువంటి పోరాట స్ఫూర్తిని చూసి జాలిపడెను. వారందరూ మరణించబోవుచున్నారని తెలుసుకుని సున్నిత హృదయము కలిగిన అర్జునుని శరీరము కంపించెను. అశృధారలు కారెను. ఇది అర్జునుని బల హీనత కాదని మనము గమనించవలెను. భక్తునిగా కోమల హృదయునిగా తన సైన్యము పట్లే కాక పరుల సైన్యము పట్ల కూడా కరుణను కలిగి ఉండెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement