Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 16,17,18
16
అనంతవిజయం రాజా
కుంతీపుత్రో యుధిష్ఠిర: |
నకుల: సహదేవశ్చ
సుఘోషమణిపుష్పకౌ ||
17
కాశ్యశ్చ పరమేష్వాస:
శిఖండీ చ మహారథ: |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ
సాత్యకిశ్చాపరాజిత: ||
18
ద్రుపదే ద్రౌపదేయాశ్చ
సర్వశ: పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహు:
శంఖాన్‌ దధ్ము: పృథక్‌ పృథక్‌ ||

16-18తాత్పర్యము : ఓ రాజా ! కుంతీపుత్రుడైన యుధిష్టిరుడు అనంత విజయమనెడి తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనెడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనెడి శంఖమును పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, ధృష్టధ్యుమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదితనయుడు, గొప్ప బాహువులు గలిగిన సుభద్రాతనయుడు మున్నగు వీరులందరూ తమతమ శంఖములను పూరించిరి.

భాష్యము : సంజయుడు ధృతరాష్ట్రుని పధకాల వలన ఘోరవిపత్తు సంభవించనున్నదని సూచన చేయుచున్నాడు. పాండవులను తప్పించి తన పుత్రులకు పట్టం కట్టాలని అనేక పధకాలు వేసి చివరకు ధృతరాష్ట్డుడు ఈ యుద్ధానికి కారకుడయ్యెను. ఇప్పటికే కనిపించుచున్న సంకేతాల ప్రకారము అక్కడ భీష్‌మ పితామహుడితో మొదలుగా అభిమన్యుడి వరకూ ఇతర రాజులతో సహా అందరూ మరణించనున్నారని, తన పుత్రుల పధ కాలను ఆమోదించినందుకు ఈ వినాశనానికి ధృతరాష్ట్రుడే బాధ్యత వహించాలని సూచన ప్రాయంగా తెలియజేయటమైనది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement