Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 15
15
పాంచజన్యం హృషీకేశో
దేవదత్తం ధనంజయ: |
పౌండ్రం దధ్మౌ మహాశంఖం
భీమకర్మా వృకోదర: ||

తాత్పర్యము : శ్రీ కృష్ణ భగవానుడు పాంచజన్యమనెడి తన శంఖమును పూరించెను; అర్జునుడు దేవదత్తమనెడి తన శంఖమును పూరించెను; భోజన ప్రియుడును, ఘన కార్యములను చేయువాడును అగు భీముడు పాండ్రమనెడి తన మహాశం ఖమునూదెను.

భాష్యము : భగవంతుని వేరు వేరు కార్యాల వలన ఆయనకు అనేక నామములు ఉన్నవి. ఇక్కడ హృషీకేశ అని పిలవబడినాడు. అనగా అందరి ఇంద్రియములకు ప్రభువు అని. అయితే జీవులు నిరాకారులు అని భావించేవారు ఇంద్రియాలను లెక్కచేయరు. అయితే కృష్ణుడు పరమాత్మరూపములోఅందరి హృదయాలలో ఉండి వారి ఇంద్రియాలను నిర్దేశిస్తూ ఉంటాడు. అయితే జీవియొక్క శరణాగతిని బట్టి ఆ విధమైన సూచనలు ఇస్తూ ఉంటాడు. అయితే శుద్ధభక్తులైన అర్జునుని వంటి వారికి మాత్రం తానే స్వయంగా వారి ఇంద్రి¸ ుములను నిర్దేశిస్తూ ఉంటాడు. కృష్ణునితో మొదలుగా పాండవుల శంఖానాదములు వారి పక్షపు సైన్యమును ఎంతగానో ఉత్సాహపరచినవి. అయితే ప్రతిపక్షమున అటువంటి ప్రస్తావనే లేదు. అంతేకాక సర్వాధ్యక్షుడైన కృష్ణుడు గాని, విజయలక్ష్మి గాని వారి పక్షాన లేదు. కాబట్టి శంఖానాదముల ద్వారా కౌరవులకు ఓటమి తప్పదని సూచించబడినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement