Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 49
49.
అసక్తబుద్ధి: సర్వత్ర
జితాత్మా విగతస్పృహ: |
నైష్కర్మ్యసిద్ధిం పరమాం
సన్న్యాసేనాధిగచ్ఛతి ||

తాత్పర్యం : ఆత్మ నిగ్రహము కలవాడును, అనాసక్తుడును, భౌతిక సుఖములను త్యజించు వాడును అగు మనుజుడు సన్యాసము ద్వారా కర్మఫల విముక్తి యనెడి అత్యున్నత పూర్ణత్వస్థాయిని పొందగలడు.

భాష్యము : తాను భగవంతునిలో భాగమైన వ్యక్తినని ఎల్లప్పుడు భావించగలిగే వ్యక్తి నిజమైన వైరాగ్యమును కలిగి ఉన్నట్లు లెక్క. అటువంటి అవగాహన ఉండుట చేత భగవంతుడే తన కార్యముల ఫలితములను అనుభవించవలెనని భావించును. ఇదే నిజమైన కృష్ణ చైతన్యము. ఈ విధముగా భగవంతుని కోసము పని చేయుట వలన దివ్యమైన ఆనందమును పొందుచూ భౌతికమైన వాటి పట్ల ఆసక్తిని కోల్పోతాడు. కృష్ణ చైతన్యములో పని చేయు వ్యక్తి సహజముగానే తన పూర్వ కర్మల నుండి విముక్తిని పొందును. అందువలన అటువంటి వ్యక్తి సన్యాస దుస్తులను ధరించకపోయినా నిజమైన వైరాగ్యమును కలిగి ఉంటాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement