Wednesday, November 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 10
10
అపర్యాప్తం తదస్మాకం
బలం భీష్‌మాభిరక్షితమ్‌ |
పర్యాప్తం త్విదమేతేషాం
బలం భీమాభిరక్షితమ్‌ ||

తాత్పర్యము : మన సైన్యబలము లెక్కింప వీలులేనిదిగా నున్నది మరియు మనము పితామహుడైన భీష్‌మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కాని భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా నున్నది.

భాష్యము : ఇక్కడ దుర్యోధనుడు ఇరుపక్ష సైన్యాల సమర్థతను పోల్చుచున్నాడు. ఒకవైపు సైన్యాలు భీ ష్‌మునిచే రక్షింపబడుచుండగా, మరొకవైపు సైన్యాన్ని భీముడు రక్షించుచున్నాడు. భీష్‌ముని ముందు భీముడు అల్పుడని ధుర్యోధనుని అభిప్రాయము. దుర్యోధనుడికి భీముని పట్ల గల అసూయ వలన భీమున్ని ఎప్పుడూ చిన్నచూపు చూసేవాడు. ఈ లెక్కప్రకారము దుర్యోధనుడు విజయము తమదేనని నిర్ణయానికి వచ్చినాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement