Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 2
02
సంజయ ఉవాచ
దృష్ట్యా తు పాండవానీకం
వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యమ్‌ ఉపసంగమ్య
రాజా వచనమబ్రవీత్‌ ||

తాత్పర్యము : సంజయుడు పలికెను : ఓ రాజా ! పాండుతనయులచే వ్యాహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను.

భాష్యము : ధృతరాష్డ్రుడు పుట్టుకతో గుడ్డివాడే కాక ఆధ్యాత్మిక జ్ఞానము కూడా లోపించినవాడు. అతని పుత్రులు కూడా తండ్రికి తగ్గవారే కనుక ధర్మపు బిడ్డలైన పాండవులతో ఎన్నడూ కలిసి ఉండలేకపోయిరి. కాబట్టి యుద్ధము అనివార్యమయ్యెను. నేడు పుణ్యక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావము చేత వారు మనస్సు మార్చుకోలేదని యుద్ధము జరుగబోతోందని సంజయుడు తెలియజేయుటకు, దుర్యోధనుడు పాండవుల సైన్యమును చూసి కల తనొంది ద్రోణాచార్యుని చెంతకు వెళ్ళెనని ధృతరాష్ట్రునికి చెప్పనారంభించెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement