Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 24

24
బ్రహ్మర్పణం బ్రహ్మ హవి:
బ్రహ్మగ్నౌ బ్రహ్మణా హుతమ్‌ |
బ్రహ్మైవ తేన గంతవ్యం
బ్రహ్మకర్మసమాధినా

తాత్పర్యము : కృష్ణభక్తి రసభావన యందు సంపూర్ణముగా నిమగ్నుడైన మనుజుడు భగద్ధామమును తప్పక పొంది తీరును. స్వీకరించునది మరియు అర్పింపబడునది యను రెండును బ్రహ్మమేయైనుటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతగు తత్పరుడై యుండుటయే అందులకు కారణము.

భాష్యము : కృష్ణ భక్తి భావనతో చేసే కర్మలు ఏ విధముగా అంత్యమున మనుజుని ఆధ్యాత్మిక గమ్యమును చేర్చగలవో ఇచ్చట వివరింపబడినది. ప్రతి వ్యక్తీ ఏదో ఒక కర్మ చేయుట తప్పదు. అట్టి కార్యముల భౌతిక చైతన్యముతో చేయుట వలన బుద్ధుడు అగును. అట్టి బద్ధ జీవిని భౌతిక భావన నుండి ముక్తి చేయు విధానమే కృష్ణ భక్తి రస భావనము. ఉదాహరణమునకు పాల పదార్థములను అధికముగా భుజించుటచే అతిసారవ్యాధి వచ్చినపుడు విరుగుడు పాల పదార్థమే అయిన పెరుగును తీసుకొనునట్లు, విషయ వాంఛలతోరోగ గ్రస్తుడైన వ్యక్తిని ఇచ్చట భగవద్గీత యందు తెలుపుచున్న సూత్రాల ద్వారా బాగుపరచవచ్చును. ఈ పద్దతినే యజ్ఞము లేదా విష్ణు ప్రీత్యర్థమే చేయు కర్మాగా పేర్కొందురు. ”బ్రహ్మము” అనగా ఆధ్యాత్మికము అని భావము. శ్రీ కృష్ణభగవానుడే పరబ్రహ్మము. అతని దివ్య శరీరరకాంతియే ఆధ్యాత్మిక తేజమైన ” బ్రహ్మజ్యోతి”గా పిలువబడును. సమస్తమూ ఈ బ్రహ్మజ్యోతి యందే నిలిచి యుండును. కాని అట్టి బ్రహ్మజ్యోతి మాయచే లేక ఇంద్రియ బోగవాంఛచే కప్పబడినప్పుడు భౌతికమనబడును. ఆ భౌతిక తెర కృష్ణ భక్తి భావనచే తొలగింబడుట వలన ఆ భావన యందు అర్పణము చేయబడునది, అట్టి అర్పణము స్వీకరించునది, అర్పణ విధానము, అర్పణము చేయువాడు, దాని ఫలితములు అన్నియును బ్రహ్మమే అయిఉన్నవి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement