అధ్యాయం 4, శ్లోకం 22
22
యదృచ్ఛాలాభసంతుష్టో
ద్వంద్వాతీతో విమత్సర: |
సమ: సిద్ధావసిద్ధౌ చ
కృత్వాపి న నిబధ్యతే
తాత్పర్యము : యాదృచ్చికముగా లభించినదానితో సంతుష్టుడగువాడును, ద్వంద్వాతీతుడును, అసూయ లేనివాడును, జయాపజయాల యందు స్థిరుడై యుండెడి వాడును. అగు మనుజుడు కర్మలను చేస్తున్నప్పటికీ ఎన్నడును బంధితుడు కాడు.
భాష్యము : భగవత్సేవా తత్పరుడు దేహ పోషనార్థమై ఎక్కువగా శ్రమింపడు. న్యాయముగా శక్తి కొలది కర్మను చేసి వచ్చిన దానితో సంతృప్తి నొందును. ఈ సమాజములోద జీవించుచున్నప్పుడు ఒనరించవలసిన బాధ్యతలు తన సేవకు అవి ఆటంకము కాకుండా ఉండునట్లు అతడు చూసుకొనుము. భగవంతుని కోసము ఏ కార్యమైననూ చేయుటకు సిద్ధమే కనుక సుఖదు:ఖముల యందు శీతోష్ణముల యందు చలించక సేవను కొనసాగించును. ఆ విధముగా ద్వంద్వాతీతుడగుటచే జయాపజయములందునూ కలవరపడడు. మనుజుడు దివ్యజ్ఞానమును పొందినపుడు అతనిలో ఇటువంటి చిహ్నములు కనిపించును.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..