Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 41
41
తస్మాత్‌ త్వమింద్రియాణ్యాదౌ
నియమ్య భరతర్షభ |
పాప్మానం ప్రజహి హ్యేనం
జ్ఞానవిజ్ఞాననాశనమ్‌ ||

అర్థము : కావున భరత వంశీయులలో శ్రేష్టుడైన ఓ అర్జునా! ఇంద్రియ నిగ్రహము ద్వారా పాప చిహ్నమైన ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి, జ్ఞానము మరియు ఆత్మానుభవములను నాశనము చేయునట్టి దానిని నశింపజేయుము.

భాష్యము : కామము అనేది జీవికి సహజముగా ఉన్న భగవత్‌ ప్రేమ యొక్క ప్రతిబింబము మాత్రమే. చిన్నప్పటి నుండి తగిన శిక్షణ ఇచ్చినట్లయితే ఆ ప్రేమ కామముగా మారే అవకాశము ఉండదు. ఒక సారి కామముగా మారితే తిరిగి దానిని ప్రేమగా మార్పు చెందించుట అంత సులభము కాదు. అయితే కృష్ణ చైతన ్యము చాలా శక్తి వంతమైనది. ఎవరైనా దాని ఆవశ్యకతను తెలసుకొని, ఏ స్థితిలో మొదలు పెట్టినా ఇంద్రియాలను భగవత్‌ సేవా కార్యక్రమాల ద్వారా ని గ్రహించినట్లయితే, వారు ఆ కామాన్ని, మానవ జీవిత పరమార్దమైన భగవత్‌ ప్రేమగా మార్చుకోగలుగుతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement