అధ్యాయం 3, శ్లోకం 37
37
శ్రీ భగవాన్ ఉవాచ
కామ ఏష క్రోధ ఏష
రజోగుణసముద్భవ:
మహాశనో మహాపాప్మా
విద్ధ్యేనమిహ వైరిణమ్ ||
అర్థము : శ్రీకృష్ణ భగవానుడు పలికెను : అర్జునా! రజోగుణ సంపర్కము వ లన పుట్టి, క్రోధముగా మారు కామమే దీనికి కారణము. అదే ఈ ప్రపంచము నంతటినీ కబళి ంచునట్టి పాప భూయిష్ట శత్రువు.
భాష్యము : పుల్లని చింతపండు కలయుట చేత పాలు పెరుగుగా మార్పు చెందునట్లు, భౌతిక సంపర్కములోనికి వచ్చినంతనే జీవి యొక్క భగవత్‌ప్రేమ కామముగా మారుతుంది. కామము సంతృప్తి చెందనిచో క్రోధముగా, ఆ క్రోధము మోహముగా మారి భౌతిక జీవనాన్ని పొడిగిస్తూ ఉంటుంది. బద్ధజీవుల వాంఛలను తీర్చుకొను అవకాశము ఇచ్చుటకే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించెను. అలా ఆనందించటానికి ప్రయత్నించీ ప్రయత్నించీ ఎప్పుడైతే జీవి విసిగిపోతాడో అప్పుడు జీవి తన ఉనికిని గురించి ప్రశ్నించే అవకాశము కలదు. ఆ విధముగా కామము తిరిగి కృష్ణచైతన్యవంతులగుటకు సహకరించిన, అట్టి కామమును, క్రోధము మనకు మిత్రములే.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..