అధ్యాయం 3, శ్లోకం 35
35
శ్రేయాన్ స్వధర్మో విగుణ:
పరధర్మాత్ స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయ:
ప రధర్మో భయావహ: ||
అర్థము : పర ధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను దోషములతో కూడుకున్నా స్వధర్మమునే ఆచరించుట మేలు. పరధర్మ పాలనము హానికరమైనది. కావున దానిని పాటించుట కన్ననూ స్వధర్మ పాలనము నందు స ర్వాన్ని కోల్పోవలసి వచ్చినా ఇదియే ఉత్తమము!
భాష్యము : ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యముతో వారి వారి ధర్మాలను చేయవలసినదే గాని, వేరే వారి ధర్మాలను అనుకరించరాదు. త్రిగుణాల ఆధీనములో ఉన్నప్పుడు, స్వభావరిత్యా శాస్త్రములో తెలుపబడిన వాటిని పాటించి తీరాలి. ఉదాహరణకు బ్రాహ్మణుడుక్షమా గుణాన్ని కలిగి ఉండాలి, మరియు క్షత్రియుడు హింసకు వెనుకాడక యుద్ధము చేయవలసి ఉంటుంది. యుద్ధములో ఓడినా మంచిదే గాని, బ్రహ్మణ గుణమైన అహింసను ఆశ్రయించరాదు. హృదయ పవిత్రీకరణ జరగకుండా హటాత్తుగా ధర్మాలను విడనాడరాదు. ఈ విధముగా స్వధర్మాన్ని ఓపికతో నిర్వహిస్తూ, గురువు మార్గ దర్శకత్వములో క్రమేణా త్రిగుణాలను అధిగమించి కృష్ణ చైతన్యములో స్థిరులవ్వాలి.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..