Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 25
25
సక్తా: కర్మణ్యవిద్వాంసో
యథా కుర్వంతి భారత |
కుర్యాద్విద్వాంస్తథాసక్త:
చికీర్షుర్లోకసంగ్రహమ్‌ ||

అర్థము : అజ్ఞాని ఫలాసక్తితో కర్మ చేయునట్లు, విద్యావంతుడు ఇతరులకు మార్గ దర్శనము చేయుటకు ఫ లాసక్తి లేకుండా కర్మలను చేయవలెను

భాష్యము : భక్తుడికీ, భక్తుడు కానివానికీ మధ్య వ్యత్యాసము వారి కోరికలను బట్టి ఉండును. చూడటానికి వారిద్దరూ ఒకే కార్యము చేస్తున్నట్లు కనిపించినా, భక్తుడు భగవంతుని ప్రసన్నార్ధము చేస్తే , అభక్తుడు లేదా కర్మి తన ఆనందము కోసమే చేయుచుండును. కాబట్టి కృష్ణ భక్తుడు కర్మ ఫల ప్రయోజనమును ఎలా కృష్ణుని ప్రసన్నార్ధము వినియోగించవచ్చునో ఇతరులకు చూపించవలసి ఉన్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement