అధ్యాయం 3, శ్లోకం 24
24
ఉత్సీదేయురిమే లోకా
న కుర్యాం కర్మ చేదహమ్ |
సంకరస్య చ కర్తా స్యామ్
ఉపహన్యామిమా: ప్రజా: ||
అర్థము : నేను విద్యుక్త ధర్మములను నిర్వహింపనిచో లోకములన్నీ నాశనము కాగలవు. అవాంఛిత సంతానానికి కారకుడైన జీవుల శాంతిని నష్టపరచినవాడిని అగుదును.
భాష్యము : శ్రీ కృష్ణ భగవానుడు జీవులందరి కీ తండ్రి కనుక ఒక వేళ జీవులు తప్పుదారి పట్టినచో ఆ బాధ్యత పరోక్షముగా అతనికే చెందుతుంది. కనుకనే ఎప్పుడు ధర్మ నియమముల పట్ల ధిక్కారమేర్పడుతుందో అప్పుడు అతడు అవతరించి సంఘమును సరిచేయును. మనుము భగవంతుని అడుగుజాడలో నడవవలసియున్ననూ ఎప్పుడూ అతనిని అనుకరించరాదు. కొందరు కృష్ణుని రాసలీలను అనుకరించుటకు ప్రయత్నించుదురు గాని, గోవర్ధనము ఎత్త చేతకాదు. శివుని వలె విషము సేవించిన ఇక మిగిలి ఉండరు. కాబట్టి గొప్ప వ్యక్తుల సూచనలను పాటించవలెనే గాని వారి కార్యములను అనుకరించరాదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..