అధ్యాయం 3, శ్లోకం 20
20
కర్మణౖవ హి సంసిద్ధిమ్
ఆస్థితా జనకాదయ: |
లోకసంగ్రహమేవాపి
సంపశ్యన్ కర్తుమర్హసి ||
అర్థము : జనక మహారాజు వంటి రాజులు కేవలము తమ విద్యుక్త ధర్మములను చేయుట ద్వారానే సంపూర్ణత్వమును పొందిరి. కావున సామాన్య జనులకు ఆదర్శముగా ఉండుటకై నీవు కూడా నీ కర్మను చేయుము.
భాష్యము : జనకుడు సీతాదేవి తండ్రి, శ్రీరాముని మామగారు. అందుచే ఆయన భగంతుని విశుద్ధ భక్తుడై ఉన్నాడు. అటువంటి విశుద్ధ భక్తులైన రాజులు వేదవిధులను నిర్వహించవలసిన అవసరము లేదు. కాని మిధిలకు రాజుగా సామాన్య జనులకు ఉదాహరణ చూపుటకై తన విద్యుక్త ధర్మములను విధేయతతో పాటించెను. అదేవిధముగా భగవంతుడైన శ్రీకృష్ణుడు గాని, అతని శాశ్వత మిత్రుడైన అర్జునుడు గాని కురుక్షేత్ర రణరంగములో యుద్ధము చేయవలసిన అవసరము లేనప్పటికీ, మంచి మాటలు విఫలమైన చోట హింస తప్పనిసరి అని తెలియజేయుటకై యుద్ధము చేసిరి. స్వయముగా శ్రీకృష్ణుడు రాయబారము చేసినను ఎదుటి పక్షము వారు యుద్ధమునకే సిద్ధ పడుట వలన హింస తప్పని సరి అయినది. కృష్ణ చైతన్యములో పరిపక్వత చెందిన భక్తులు సైతమూ ఇతరులకు ఉదాహరణగా ఉండేట ట్లు కర్మనొనరించాలి
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..