Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 9
09
యజ్ఞార్థాత్‌ కర్మణో2న్యత్ర
లోకో2యం కర్మబంధన: |
తదర్థం కర్మ కౌంతేయ
ముక్తసంగ: సమాచర ||

తాత్పర్యము : విష్ణువు కొరకై యజ్ఞరూపమున కర్మనొనరింపవలెను. లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారకము కాగలదు. ఓ కుంతీపుత్రా ! నీ విద్యుక్త ధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు.

భాష్యము : ”యజ్ఞోవైవిష్ణు:” – అనగా యజ్ఞములన్నియునూ విష్ణువు ప్రీత్యర్థమే నిర్ణయింపబడినవి. అట్లే వర్ణాశ్రమ ధర్మములు సైతమూ విష్ణువు ప్రీత్యర్థమే. విష్ణువును ప్రత్యేక్షముగా ఆరాధించిననూ అదే ప్రయోజనము కలుగుతుంది. కాబట్టి ప్రతిఒక్కరూ విష్ణువు యొక్క సంతృప్తికే పనిచేయవలెను. విష్ణువును ప్రత్యక్షముగా ఆరాధించిననూ అదే ప్రయోజనమ కలుగుతుంది. కాబట్టి ప్రతిఒక్కరూ విష్ణువు యొక్క సంతృప్తికే పనిచేయవలెను లేనట్లయితే ఈ భౌతిక ప్రపంచములో ఎట్టి కర్మనొనరించినా, దాని ఫలితముగా వచ్చు శుభాశుభములు భవబంధాన్నే పెంచుతాయి కాని ముక్తులను చేయవు. విష్ణుప్రీత్యర్థము కర్మనొనరించుట ఒక కళ వంటిది. దీనికి అనుభవజ్ఞుడైన కృష్ణభక్తుని మార్గదర్శకత్వము ఆవశ్యకము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement