Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 69
69
యా నిశా సర్వభూతానాం
తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని
సా నిశా పశ్యతో మునే: ||

తాత్పర్యము : సకల జీవులకు ఏది రాత్రియో అదియే ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులు మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము.

భాష్యము : రెండు రకాల తెలివి గలవారు ఉందురు. ఒకరు ఇంద్రియ తృప్తికి భౌతిక కార్యములు చేయుటలో తెలివిని ప్రదర్శిస్తే, రెండువ వ్యక్తి ఆత్మపరిశీలనలో ఆత్మ సాక్షాత్కారమునకు తెలివిని వినియోగించువాడు. అటువంటి ఆత్మశీలుని కార్యక్రమములు భౌతిక మగ్నత కలిగిన వ్యక్తికి రాత్రి వంటివి. భౌతిక వ్యక్తి యొక్క ‘రాత్రి’ యందు ఆత్మశీలుడు జాగురూకతతో ఉంటాడు. ఆత్మశీలుడు క్రమేణ పురోగతి చెందుతూ దివ్యానందాన్ని పెంపొందించుకుంటూ ఉంటే, భౌతికమైన వ్యక్తి ఆత్మసాక్షాత్కారాన్ని మరచి రకరకాల ఇంద్రియ ఆనందాన్ని ఊహించుకుంటూ కొన్నిసార్లు ఆనందాన్ని మరికొన్నిసార్లు దు:ఖాన్ని పొందుచూ ఉంటాడు. అదే ఆత్మశీలుడు భౌతిక సుఖదు:ఖాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉంటాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement