అధ్యాయం 2, శ్లోకం 67
67
ఇంద్రియాణాం హి చరతాం
యన్మనో ను విధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం
వాయుర్నావమివాంభసి ||
తాత్పర్యము : నీటియందలి నావను బలమైన వాయువు త్రోసివేయు రీతి, మనస్సు దాని యందు లగ్నమైనపుడు చరించు ఇంద్రియములలో ఒక్కటైనను సరియే మనుజుని బుద్ధిని హరింపగలదు.
భాష్యము : అన్ని ఇంద్రియములను భగవంతుని సేవలో వినియోగించినట్లుయితే, ఏ ఒక్క ఇంద్రియము దారి తప్పినా అది వ్యక్తిని ఆధ్యాత్మిక పురోగతి నుండి తప్పు దోవ పట్టించే అవకాశము ఉన్నది. కాబట్టి అంబరీష మహారాజు వలే అన్ని ఇంద్రియములను కృష్ణ చైతన్యములో నియుక్తము చేసినట్లయితే మనస్సును నియంత్రించగలుగుతాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….