అధ్యాయం 2, శ్లోకం 62
62
ధ్యాయతో విషయాన్ పుంస:
సంగస్తేషూపజాయతే |
సంగాత్ సంజాయతే కామ:
కామాత్ క్రోధో భిజాయతే ||
తాత్పర్యము : ఇంద్రియార్ధములను ధ్యానించునపుడు వాని యెడ మనుజునికి ఆసక్తి కలుగును. ఆ ఆసక్తి నుండి కామము వృద్ధినొందగా, కామము నుండి క్రోధము ఉద్భవించును.
భాష్యము :కృష్ణచైతన్యము లేనప్పుడు మనస్సు ఇంద్రియ భోగము(ను) ధ్యానించినట్లయితే భౌతిక కోరికలు ఉదయిస్తాయి. ఇంద్రయములకు సరైన కార్యములు ఉండవలెను. భగవంతుని సేవలేనిదే భౌతికమైన వాటిలో అవి నిమగ్నమవుతాయి. దీనికి బ్రహ్మ, శివుని వంటి దేవతలు కూడా అతీతులు కారు. ఇక మిగిలిన వారి గురించి చెప్పనేల! శివుడు పార్వతి వలన తపోభంగమై కార్తికేయునికి జన్మనిచ్చెను. అయితే భక్తుడైన హరిదాసుడు మాయాదేవే స్వయముగా వచ్చినా చలించలేదు. భగవత్సాంగత్యము వలన ఉన్నత రుచి ఉండుటచే భక్తుడు భౌతిక ఇంద్రియ తృప్తిని నిరారించగలుగుతాడు. ఇదే అతని విజయమునకు కారణము. ఆ విధమైన కృష్ణ చైతన్యము లేనప్పుడు కృత్రిమముగా ఎంతగా ఇంద్రియములను నిగ్రహించాలని ప్రయత్నించినా చిన్నపాటి ప్రలోభానికి ఎంతటి వాడైనా దాసుడై భౌతిక వాంఛలను తీర్చుకోవాలనుకుంటాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..