Saturday, November 23, 2024

భగవద్గీత దేనికి సూచిక!

ఆధ్యాత్మిక తత్త్వాన్ని పరిపూర్ణంగా, ఏ మతకుల ప్రసక్తి లేకుండా, సకల ప్రపంచ జనావళికి వర్తించేటట్లు, ఒక గురువు ఒక శిష్యునకు జీవితగమనం గురించి వివరించినట్లు, దేవుడు ఒక భక్తునికి జీవిత రహస్యాలను వివరించినట్లు, చెప్పబడిన భగవంతుని మాట (వేల్పు మాట) ఈ భగవద్గీత. ప్రపంచ తాత్విక వాఙ్మయ చరిత్రలోనే భగద్గీతను పోలిన విశిష్టమైన గ్రంథం, మరొకటి లేదు, దానికి అదే సాటి, అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది ఎందరికో నిత్య పారాయణ గ్రం థం. మార్గ నిర్దేశకం, సంశయ విచ్చేదకం, దు:ఖ నివారకం గ్రంథం అని చెప్పవచ్చు.
గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్య ము, ఆ గమ్య సాధనా యోగములు వివరించబడినవి. ఈ భగవద్గీత క్రీస్తుపూర్వం దాదాపు 2000 సంవత్సరాల క్రితమే వ్రాయబడినదని చెబుతుంటారు. ఈ గ్రంథం దాదాపు 75 ఇతర భాషలో అనువ దించబడినది. ప్రపంచంలో ఈ గ్రంథానికి ఉన్న అనువాదాలు, టీకా తాత్పర్యాలు, విమర్శలు, భాష్యాలు , వ్యాఖ్యానాలు వేల సంఖ్య లో ఉన్నాయి. ఇలా మరే ఇతర గ్రంథానికి లేవు.
గీత ఒక అద్దం వంటిది. అద్దంలో నిన్ను నీవు చూసుకుంటే ఎలా కనిపిస్తావో, అలా ఈ గీతలో నీ జీవిత ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే నీవు దు:ఖిస్తూ ఉంటే అద్దంలో నీ మోము దు:ఖంగానే ఉం టుంది. నవ్వుతూ ఉంటే నవ్వుదనంతో ఉంటుంది. నిశ్చలంగా ఉంటే నిచ్చలంగా, సంతోషంగా ఉంటే సంతోషంగా, నీవు ఎలా ఉంటే అలా గే అద్దంలో కనిపిస్తావు. అదేవిధంగా నీవు గీతను ఏ దృష్టితో చదివితే ఆ దృష్టితో నీకు సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనిషిగా నీవు ఏమి చేయాలో, ఏమి చేయ కూడదో, నీవు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, నీ కర్మ అంటే ఏమి టి? నీవు పొందే ఫలితం ఏమిటి? తెలియజేస్తుంది. సృష్టిలో ఉన్న అన్ని విషయాలు ఈ గీతలో నిగూఢమై ఉన్నాయి. వాటిని వెతికి వెలి కి తీసుకోవడమే మనుషులుగా మన పని. అంటే ఒక బంగారు గని కనుగొన్నప్పుడు, నీవు ఎంత తవ్వుకుంటావో, అంత బంగారం నీవు పొందుతావు. అలాగే గీత, ఒక ఆత్మ తత్వాన్ని, ఆనందామృత సాగ రాన్ని నీవు ఎంతగా ఆస్వాదిస్తావో, అంత ఆస్వాదించవచ్చు. అంటే గీతను నీవు ఏ దృక్పథంతో చూస్తావో, చదువుతావో, నీ భావనపై నీ ఫలితం ఆధారపడి ఉంటుంది. దేశభక్తుడు ఆయన లోకమాన్య బాలగంగా ధర్‌ తిలక్‌ ఆయనకు గీతలో కర్మయోగం కనబడగా, మహాత్మా గాం ధీకి అ#హంస ప్ర బోధం. అరవిందుడికి భక్తి మార్గం. వివేకానందునికి వేద మార్గం కని పించాయి. అయితే దీనికి నీకు దృఢ సంకల్పం, శ్రద్ధ, ఓర్పు కావాలి.
ఈ భగవద్గీత వలన అనేకమంది విదేశీ ప్రముఖులు ,శాస్త్రజ్ఞులు , మహామ#హులు , దేశానాయకులు, ప్రముఖులు, శాస్త్రవేత్తలు, సా మాజికవేత్తలు, సా#హత్య వేత్తలు ప్రభావితమైనారు.మన గాంధీ తన ఆత్మ కథలో తనకు ఏ సమస్య వచ్చినా తక్షణం తాను భగవద్గీత చది వేవాడినని, దాని ద్వారా వారి సమస్యకు, పరిష్కారం కనపడేదని చెప్పేవారు. అలాగే వివేకానంద ,భగవద్గీత ఒక అంతులేని రహస్య సంపదని , ఆత్మవిశ్వాసాన్ని పెంచేది అని తెలియజేశారు.
భగవద్గీత ఒక ఆధ్యాత్మిక త్రివేణి సంగమం. ఇందులో జ్ఞాన యోగం, కర్మయోగం భక్తియోగం మూడు ప్రతిపాదితాలై ఉంటా యి. యోగం అంటే ఉపాయం, దైవాన్ని చేరుకునే మార్గము, పద్ధతి అని చెప్పవచ్చు. కర్మ అనేది…. చెట్లకు పూచే పువ్వు వంటిది.
భక్తి అనేది… పువ్వు నుండి పుట్టే కాయ. జ్ఞానం అనేది… పండిన పండు. భగవద్గీతలోని గీతోపదేశ సన్నివేశాన్ని మన సాధారణ జీవితానికి ప్రతీకగా తీసుకోవచ్చు. మానవుడి మనసు కురుక్షేత్రం. అర్జునుడు నరుడు. అంటే ప్రతి నరుడుకి అతని కర్తవ్యాన్ని గుర్తుచే స్తూ, బాధ్యతను ఉపదేశించే నారాయణుడే ప్రతి నరునిలో అంతర్గ తంగా ఉండే అంతరాత్మ. అర్జునుడికి కలిగిన అనుమానాన్ని నివృత్తి చేయడానికి, జీవాత్మకు పరమాత్మ తెలియజేసే కర్తవ్యం బోధన. అం టే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఫలానా పని చేయవచ్చు నా? చేయకూడదా? ఏది నైతికం! ఏది అనైతికం ఏది కర్తవ్యం, ఏది అకర్తవ్యం అనే ధర్మసందేహాలు ,ప్రతి మనిషికి అనేక సందర్భాలలో కలుగుతాయి. ఆ సందర్భాలలో, ఈనాటికి, ఏనాటికి గీతలోని ఉపదే శాలు సూచికగా నిలబడతాయి. మార్గదర్శకం అవుతాయి. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఈ ఉపదేశాన్ని అన్వయించుకోవాలి.
అంటే ఆలోచన కృష్ణుడు, ఆచరణ అర్జునుడు, అనగా ఆలోచన ను ఆచరణలో పెట్టినప్పుడే, అది కార్యాచరణ జరిగి ఫలితం వస్తుం ది. వట్టి ఆలోచన ఆచరించకుండా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అది నీ మనసులో ఒక భావనగానే మిగులుతుంది. ఆ ఆలోచన వలన ఎలాంటి ఫలితము ఉండదు. కనుక ఆలోచనను సరై న మార్గంలో ఆచరణలో పెట్టి, ఫలితాన్ని పొందడ మే భగవద్గీత సారాంశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement