Wednesday, November 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 29
29
ప్రకృతేర్గుణసమ్మూఢా:
సజ్జంతే గుణకర్మసు |
తానకృత్స్నవిదో మందాన్‌
కృత్స్నవిన్న విచాలయేత్‌ ||

అర్థము : ప్రకృతి త్రిగుణములచే మోహపరవశులైన అజ్ఞానులు భౌతిక కార్యకలాపాలలో మునిగిపోయి భౌతిక బంధనాలలో చిక్కుకుపోవుదురు. అయితే అజ్ఞాన కారణమున వారి కార్యాలు అధమములైననూ, జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు.

భాష్యము : అజ్ఞానులు భౌతిక చైతన ్యమును కలిగి ఉండి ఆత్మ జ్ఞానము పట్ల ఆసక్తిని కలిగి ఉండరు. వారు ఈ శరీరమే సర్వస్వమని, బంధువులే సన్నిహితులని, జన్మభూమే పూజనీయమని, నామ మాత్రపు పూజలు, తంతులే భక్తియని భావింతురు. వారు సాంఘిక, జాతీయ లేదా మానవ సేవా
కార్యక్రమాలలో నిమగ్నులగుదురు. వారు ఆత్మ సాక్షాత్కారము ఒక మిధ్యా కల్పన అని తలపోయుదురు. కాబట్టి జ్ఞానవంతులు అట్టి వారి జోలికి పోకుండా, తమ కార్యాలను గుట్టుచప్పుడు కాకుండా చేసుకుపోతుండాలి. భక్తి మానవ జీవితానికి అత్యంత ఆవశ్యకము కావున అప్పుడప్పుడు గొప్ప భక్తులు అటువంటి అజ్ఞానులను సైతమూ మార్చుటకు ప్రయత్నించుదురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement