Tuesday, November 26, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 13,14

13.
సమం కాయశిరోగ్రీవం
ధారయన్నచలం స్థిర: |
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం
దిశశ్చానవలోకయన్‌ ||

14.
ప్రశాంతాత్మా విగతభీ:
బ్రహ్మచారివ్రతే స్థిత: |
మన: సంయమ్య మచ్చిత్తో
యుక్త ఆసీత మత్పర: ||

13-14 తాత్పర్యము : శరీరమునున, మెడను, శిరమును చక్కగా సమముగా నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరింప వలెను. ఆ విధముగా కలత నొందనటువంటి నియమిత మనస్సుతో, భయమును వీడి, బ్రహ్మచర్యమును పాటించుచు యోగియైనవాడు నన్నే
హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవితపరమగతిగా చేసికొనవలెను.

భాష్యము : ప్రతి వ్యక్తి హృదయములో చతుర్భుజ విష్ణువు రూపములో పరమాత్మగా నున్న శ్రీకృష్ణుని సాక్షాత్కరించుకొనుటయే ధ్యానా యోగాభ్యాసము యొక్క లక్ష్యము. దానికి వ్యక్తి మనసా, కర్మణా, వాచా మైధున భావాలను త్యజించి ఉండాలి. అలా కానప్పుడు యోగము కేవలమూ బూటకము మాత్రమే కాగలదు. అయితే భక్తియోగము పూర్తిగా త్యజించగలుగుతాడు. అటువంటి భక్తుడు మాత్రమే ”విగత-భీ” భయము లేని వాడు అనబడతాడు, నిజమైన యోగమును పాటించగలుగుతాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement