అధ్యాయం 6, శ్లోకం 11,12
11.
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య
స్థిరమాసనమాత్మన: |
నాత్యుచ్ఛ్రితం నాతినీచం
చైలాజినకుశోత్తరమ్ ||
12.
తత్రైకాగ్రం మన: కృత్వా
యతచిత్తేంద్రియక్రియ: |
ఉపవిశ్యాసనే యుంజ్యాత్
యోగమాత్మవిశుద్ధయే ||
11-12 తాత్పర్యము : యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత స్థలమున కేగి నేలపై కువగ్రాసమును పరచి, దానిని జింకచర్మము మరియు వస్త్రముతో కప్పవలెను. అట్టటి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందగాను ఉండక పవిత్ర స్థానములో ఏర్పాటు చేసుకొనవలెను. పిదప అతడు దానిపై స్థిరముగా కూర్చుండి ఇంద్రియమనోకర్మలను నియమించి, మనస్సును ఏకాగ్రపరచి హృదయశుద్ధి కొరకు యోగమును అభ్యసించవలెను.
భాష్యము : భారతదేశములో యోగులు, ఆధ్యాత్మిక వాదులు గృహమును వదిలి పవిత్ర ప్రదేశాలైన ప్రయాగ, మధుర, వృందావనము, హృషీకేశ, హరిద్వారము వంటివి యోగాభ్యాసమునకు అనునవి భావించి అక్కడ చేరుదురు. కాబట్టి పెద్ద పెద్ద నగరాలలో ఉన్న యోగ శిక్షణ శిబిరాలు ధనాన్ని గడించడానికి ఉపయోగపడతాయేమో గాని యోగాభ్యాసానికి కాదు. మనస్సు చలించే వ్యక్తి, ఇంద్రియ నిగ్రహము లేని వ్యక్తి, ధ్యానము చేయలేడు. కాబట్టి బృహన్నార దీయ పురాణములో ఎన్నో అవ లక్షణాలతో కూడుకుని ఉన్న కలియుగవాసులకు భగవంతుని నామములను కీర్తించుట తప్ప వేరే మార్గము లేదని తెలియజేయబడినది.