Saturday, November 23, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 4
యదా హి నేద్రియార్థేషు
న కర్మస్వనుషజ్జతే |
సర్వసంకల్పసన్న్యాసీ
యోగారూఢస్తదోచ్యతే ||

తాత్పర్యము : విషయకోరికల నన్నింటిని విడిచి ఇంద్రియ ప్రీతి కొరకు వర్తించుట గాని, కామ్య కర్మలందు నియుక్తుడగుట గాని చేయని మనుజుడు యోగారూఢుడని చెప్పబడును.

భాష్యము : సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు, భగవంతుని దివ్య సేవలో నిమగ్నుడగుట వలన తన అంతరంగమందే ఆనందమును పొందును. అందుచే అతడు కామ్య కర్మ పట్లగాని లేదా ఇంద్రియ తృప్తి పట్ల గాని ఆసక్తిని కోల్పోతాడు. ఏ జీవి అయినా కార్యాలు చేయకుండా ఉండలేడు కాబట్టి యోగములో అత్యున్నత స్థితి అయిన కృష్ణ చైతన్యమునకు చేరువంతవరకూ యాంతికముగా భౌతిక కోరికలను తొలగించుటకు ప్రయత్నించవలసి ఉంటుంది. అయితే అటువంటి ప్రయత్నములు చివరికి స్వీయ గౌరవము లేదా స్వప్రయోజన కార్యాలకు మాత్రమే దారి తీస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement