అధ్యాయం 6, శ్లోకం 2.
యం సన్న్యాసమితి ప్రాహు:
యోగం తం విద్ధి పాండవ |
న హ్యసన్న్యసంకల్పో
యోగీ భవతి కశ్చన ||
తాత్పర్యము : ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగమనియు లేదా భగవంతునితో కలయిక అనియు నీవు తెలిసికొనుము. ఓ పాండుకుమారా! ఇంద్రియప్రీతి కోరికను త్యాగము చేయనిదే ఎవ్వడును యోగి కాలేడు.
భాష్యము : కృష్ణభక్తి భావన యందున్నవాడు భగవంతుని దివ్యమైన సేవలో నిమగ్నుడగుట వలన, సర్వమూ భగవంతుని సేవ కొరకు చేయుట వలన వఅతను తనలో తాను ఆనందముగా ఉండగలడు. అందువలన అతడు ఎన్నటికి ఇంద్రియ తృప్తిలో గాని కామ్య కర్మలలో గాని నిమగ్నుడవడు.