Sunday, November 17, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 40

అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ
సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకో స్తి న పరో
న సుఖం సంశయాత్మన: ||

తాత్పర్యము : శాస్త్రములను శంకించు అజ్ఞానులు మరియు శ్రద్ధా రహితులు భగవత్‌ జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైన వారికి ఈ లోకమున గాని, పరలోకమున గాని సుఖము లేదు.

భాష్యము : మనకు అందుబాటులో ఉన్న వేద శాస్త్రాలన్నింటిలోకి ఉత్తమమైనది భగవద్గీత. జంతువుల వలె జీవించే మానవులకు అటువంటి శాస్త్రాల మీద విశ్వాసము ఉండదు. కొందరు శాస్త్రాలను చదివినా చక్కగా వల్లే వేయగలరేమో గాని భగవంతుని వాక్కులు సత్యాలు, పాటించదగినవి అనే విశ్వాసమును కలిగి ఉండరు. భగవంతుడి మీద, ఆయన వాక్కు మీద విశ్వాసము లేని వారికి ఈ జన్మలో గాని, మరు జన్మలో గాని శుభము కలుగదు. అటువంటి వ్యక్తులు ఆద్యాత్మిక జీవితములో పురోగతిని సాధించలేరు. కాబట్టి పుర్వాచార్యుల అడుగు జాడలలో నడుస్తూ గురు పరంపరలోని గురువును స్వీకరించుట ద్వారా విశ్వాసమును గడించి, జీవితమును సాఫల్యము చేసికొనవలెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement