Thursday, November 21, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 39

శ్రద్ధవాన్‌ లభతే జ్ఞానం
తత్పర: సంయుతేంద్రియ: |
జ్ఞానం తబ్ధ్వా పరామ్‌ శాంతిమ్‌
అచిరేణాధిగచ్ఛతి ||

తాత్పర్యము : మనము దివ్య జ్ఞానతత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నియమించి అట్టి ఆధ్యాత్మిక జ్ఞానమును పొందుటకు అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమ శాంతిని పొందును.

భాష్యము : ఈ దివ్యమైన జ్ఞానము కృష్ణుడిపై పూర్తి విశ్వాసము కలిగిన వ్యక్తికి సుసాధ్యమవుతుంది. ” కృష్ణుని సేవ చేసిన చాలు నేను జీవిత లక్ష్యాన్ని సాధించగలను ” అని భావించేవాడు నిజమైన శ్రద్ధావంతుడు అని అనబడును. ఇటువంటి విశ్వాసాన్ని మనము భక్తితో ” హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే ” అను మంత్రాన్ని జపించిన పొందవచ్చును. అద్దముపై ధూళిని తొలగించిన విధముగా, ఈ మంత్ర జపము మన హృదయములో పేరుకొని ఉన్న భౌతిక కల్మషాలను తుడిచి వేస్తుంది. కాబట్టి కృష్ణుడి మీద విశ్వాసము ఉండి, ఇంద్రియములను నిగ్రహించిన యెడల కృష్ణభక్తిరసభావనా జ్ఞానమును శీఘ్రమే పొందవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..
————————

Advertisement

తాజా వార్తలు

Advertisement