Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 19.

ఇహైవ తైర్జిత: సర్గో
యేషాం సామ్యే స్థితం మన: |
నిర్దోషం హి సమం బ్రహ్మ
తస్మాద్‌ బ్రహ్మణి తే స్థితా: ||

తాత్పర్యము : సమానత్వము మరియు ఏకత్వములందు మనస్సు నిలిచిన ట్టి వారు జననమరణస్థితిని జయించినట్టివారే. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టివారు. ఆ విధముగా వారు బ్రహ్మము నందు స్థితిని కలిగినట్టివారే యగుదురు.

భాష్యము : ఇంతకు ముందు శ్లోకములో పేర్కొనబడినటువంటి సమత్వాన్ని కలిగిన వ్యక్తి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినట్లు లెక్క. వారు భౌతిక పరిస్థితులకు అతీతముగా ఉండి జన్మ మృత్యువులను జయించారని అర్థం. అటువంటివారు మృత్యువు తరువాత భగవంతున్ని చేరుకుంటారు. కాబట్టి శరీర భావన నుండి మన చైతన్యాన్ని ఆత్మను గాంచే స్థితికి ఉద్దరించినట్లయితే ముక్తులను కావచ్చును. భగవంతున్ని దోషము లేనివాడు అని అంటారు. ఎందువలనంటే ఆయన ఎవరి పట్ల మమకారాన్ని లేదా ద్వేషాన్ని కలిగి ఉండడు. ఒక జ్ఞాని కూడా అదే స్థితికి వచ్చినపుడు జీవన్ముక్తుడై వైకుంఠమునకు అర్హుడగును. అటువంటి వారి లక్షనాలు రాబోవు శ్లోకాలలో తెలియజేయనున్నారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ..

Advertisement

తాజా వార్తలు

Advertisement