Friday, November 22, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 9, శ్లోకం 29

29.
సమోహం సర్వభూతేషు
న మే ద్వేష్యో స్తి న ప్రియ: |
యే భజంతి తు మాం భక్త్యా
మయి తే తేషు చాప్యహమ్‌ ||

తాత్పర్యము : నేనెవరిని ద్వేషింపను, ఎవరి యెడను పక్షపాతమును కలిగియుండను. నేను సర్వుల యెడ సమముగా వర్తింతును. కాని భక్తితో నాకు సేవనొసగెడివాడు నాకు మిత్రుడై నా యందుండును మరియు నేను అతనికి మిత్రుడనై ఉందును.

భాష్యము : ఈ సృష్టిలోని అన్ని రకాల జీవరాశులు భగవంతుని బిడ్డలే. కాబట్టి తండ్రిగా వారికి కావలసిన అన్ని సదుపాయాలను వసతులను ఆయన అందరికీ సమ కూరుస్తూ ఉంటాడు. అతడు తన అందరి బిడ్డల పట్ల సమాన దృష్టిని కలిగి ఉన్నప్పటికీ తనకు విధేయులుగా ఉండే బిడ్డలైన తన భక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement