ఆధ్యాయం 6, శ్లోకం 31
సర్వభష్త్తస్థితం యో మాం
భజత్యేకత్వమాస్థిత: |
సర్వథా వర్తమానోపి
స యోగీ మయి వర్తతే ||
తాత్పర్యము : నేను మరియు హృదయస్థ పరమాత్మ ఇరువును ఏకమేనని ఎరిగి పరమాత్మ భజన యందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నా యందే నిలిచియుండును.
భాష్యము : యోగి యొక్క పరిపూర్ణత ఏమిటంటే శ్రీకృష్ణుడే చతుర్భుజ విష్ణువు రూపములో పరమాత్మ తన హృదయములోను మరియు ఇతరుల హృదయములోనూ నివసిస్తూ ఉన్నాడని గుర్తించుట. అనగా కృష్ణుని దివ్యసేవలో సదా నిమగ్నుడైన భక్తునికి అటువంటి పరిపూర్ణ యోగికి మధ్య తేడా లేనట్టే లెక్క. ఇరువురూ ముక్త స్థితిలోనే నిలిచియుంటారు. కాబట్టి కృష్ణ చైతన్యము అనునది యోగాభ్యాసములో ఉన్నతస్థితి అనబడుతుంది. ఈ అవగాహనను శ్రీ నారదముని, శ్రీల రూపగోస్వామి మరియూ స్మృతి శాస్త్రములు సమర్ధించుచున్నవి.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..