దేవుడు ఉన్నాడనే వారు, లేడనే వారు, ఉన్నాడో లేడో తెలీదనే వారు, ఉన్నా లేనట్టే ఉంటాడనే వారు, లేకుండా ఉన్నాడు అన్నట్టే దేవుడుంటాడనే వారు మనలో చాలామంది ఉంటారు. వీరిని ఆస్తికులు, నాస్తికులు, ఆస్తిక నాస్తికులు, నాస్తిక ఆస్తికులు అని మనం పిలుస్తుంటాం. ధర్మానికి హాని జరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం, ప్రతి యుగంలోనూ తాను అవతరిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వయంగా అర్జునునికి చెబుతాడు.
మనం మాయలో బతుకుతుంటాం. మనకన్నీ సందేహా లే. ప్రతి విషయంలోనూ అనవసరమైన ఆలోచనలే. ఆ పరా త్పరుని మీదా ఎన్నో తర్కాలు. వితర్కాలు. ఆ పరమాత్మ తత్త్వంపైనా వాదనలు. సందేహాలు. సమర్ధనలు. విమర్శలు. వ్యాఖ్యలు. మనకున్న భౌతికమైన జ్ఞానంతో, ఆ భగవంతుణ్ణి ఆయన శక్తిని బేరీజు వేస్తాం. అల్పమైన మన మేధతో అనంత మైన అనితర సాధ్యమైన, ఆ అనంత తత్వం గురించి అనవస రపు ఆలోచనలు చేస్తుంటాం.
ఓసారి అక్బర్ చక్రవర్తికి ఓ సందేహం కలిగింది. ”ధర్మ రక్షణ కోసం భగవంతుడే మానవ రూపంలో ఎందుకు అవ తరించాలి? ముక్కోటి దేవతలు తన కింద ఉంటారు కదా? ఆ దేవతల్లో ఎవరో ఒకరిని పంపి ధర్మాన్ని ఉద్ధరించవచ్చు కదా? సాక్షాత్తూ ఆ భగవంతుడే ఈ భూమి మీదకు ఎందుకు రావా లి?” అని సభలో ఉన్నవాళ్ళను ప్రశ్నిస్తాడు అక్బర్.
సభలోనే ఉన్న తాన్‌సేన్ సమాధానం చెప్పేందుకు కొంత గడువు కోరతాడు. అక్బర్ చక్రవర్తి సరే అంటాడు. నాలుగు రోజులు గడిచేక, అక్బర్ తన పరివారంతో సహా నౌకా విహారా నికి వెళ్తాడు. వాళ్ళలో తాన్‌సేన్ కూడా ఉన్నాడు. నౌక బాగా నీళ్ళలోనికి వెళ్ళేక, తాన్‌సేన్ తనతో తీసుకొచ్చిన యువరాజు బొమ్మను నీటిలో పడేస్తాడు. ”అయ్యో! ఘోరం జరిగి పోయింది. యువరాజు నీళ్ళలో ప్రమాదవశాత్తూ పడిపో యాడు రక్షించండి.” అని పెద్దగా కేకలు వేస్తాడు.
తాన్‌సేన్ అరుపులు విన్న అక్బర్ చక్రవర్తి, తన కుమా రుణ్ణి రక్షించుకోవడం కోసం వెంటనే నీళ్ళలోకి దూకుతాడు. చక్రవర్తి నీళ్ళలోంచి పైకి వచ్చిన తర్వాత తాన్‌సేన్ యిలా అన్నాడు. ”క్షమించండి ప్రభూ! యువరాజును రక్షించడానికి భటులను పంపక, చక్రవర్తులైన తమరే స్వయంగా నీళ్ళలోకి దూకేరు. ఎందుకు? మీ బిడ్డమీద మీకుండే ప్రేమ అంత గాఢ మైనది కాబట్టి. అవునా?” అని ప్రశ్నించాడు.
అవును అన్నాడు అక్బర్. ”మునిగిపోతున్న కొడుకు వంటిది ధర్మం. లోకానికంతటికీ భగవంతుడు తండ్రి. లోక పిత అయిన భగవంతుడు తన బిడ్డ వంటి ధర్మాన్ని రక్షించడా నికి, యితర దేవతలను పంపకుండా తానే స్వయంగా బయ లుదేరివస్తాడు. మానవాళి పట్ల భగవంతునికి గల ప్రేమ అటు వంటిది. ఆ ప్రేమే అవ తారాలు రావడానికి కారణం. ఆ ప్రేమే అవతార తత్వానికి మూలం ”అని అన్నాడు తాన్సేన్.
జ్ఞానానికే జ్ఞానం అయిన జ్ఞానమూర్తి భగవంతుడు. మన మిడిమిడి జ్ఞానంతో భగవంతుణ్ణి పరిశీలించాలి అని అనుకోవ డం అవివేకం. భగవత్తత్వం లోతుపాతులు తరిచి చూడగలం అని అనుకోవడం అజ్ఞానం. మనకుండే పరిమిత ప్రతిభతో, ఆ పరాత్పరుణ్ణి పరీక్షించాలను కోవడం వట్టి మూర్ఖత్వం.
లౌకికమైన మన జ్ఞానానికి భగవంతుడు అందడు. మన శాస్త్ర విజ్ఞానానికి ఆయన చిక్కడు. మన తర్కాలకు, వాదాలకు ఆయన దొరకడు. స్వచ్ఛమైన ప్రేమే ఆ భగవంతుణ్ణి మనకు చిక్కేలా చేస్తుంది.
– రమాప్రసాద్ ఆదిభట్ల
93480 06669
భగవత్తత్వం
Advertisement
తాజా వార్తలు
Advertisement