Tuesday, November 26, 2024

సప్త సముద్రాల సృష్టికర్త ప్రియవ్రతుడు

బ్రహ్మ మానస పుత్రుడు అయిన స్వాయంభువ మనువు పెద్ద కుమారుడు ప్రియవ్రతుడు. ఆయన చిన్నతనం నుండి భక్తిభావాలతో పెరిగాడు. క్రమంగా వైరాగ్యమనే సంపదను పొం దాడు. ప్రియవ్రతునికి గురువు నారద మహర్షి. ఆయన ప్రియవ్రతుని గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ చేసాడు. తండ్రి రాజ్యపాలన చేపట్టమంటే తనకు అంత:పురం జీవితం అవసరంలేదని, తాను ఈశ్వరుడిని చేరుకుంటానని చెబుతాడు. చివరకు బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం రా జ్యాధికారాన్ని స్వీకరించాడు. స్వాయంభువ మనువు ప్రియవ్రతునకు పట్టాభిషేకం చేసి తపస్సు చేసుకోవడా నికి అరణ్యాలకు వెళ్లాడు. ప్రియవ్రతుడు ‘విశ్వకర్మ’ ప్రజాపతి పుత్రికయైన ‘బర్హిష్మతి’ అనే యువతిని వివాహం చేసుకొన్నాడు. బర్హిష్మతికి అగ్నీధుడు, ఇద్మ జిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్య రేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతి హోత్రుడు, కవి అనే పదిమంది కుమారులు, ‘ఊర్జ స్వతి’ అనే కుమార్తె కలిగారు. ప్రియవ్రతుడు మరొక భార్యకు ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు. వారు మనువులై మన్వంతరాలకు అధిపతులయ్యారు. ఈవిధంగా ప్రి యవ్రతుడు పదకొండు కోట్ల సంవత్సరాలు రాజ్య పాలన చేశాడు. ఒకరోజు ‘ మేరుపర్వతానికి’ ప్రదక్షి ణం చేస్తున్న సూర్యుని రథంతో సమానమైన రథాన్ని ఎక్కాడు. భగవంతుని ధ్యానం వలన కలిగిన శక్తితో సూర్యునికి పడమటి వైపున వ్యాపించిన చీకటిని తొల గించాడు. రాత్రులను పగళ్ళుగా మారుస్తానని రెండ వ సూర్యుని లాగా వెలిగిపోతూ ఏడుసార్లు సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుదు వచ్చి ప్రియవ్రతుడిని వారించాడు. ప్రియవ్రతుని రథ చక్రాల గాళ్ళు పడ్డ దారులు ‘సప్త సముద్రాలు’ అయ్యాయి. అవి- 1. జంబూద్వీపము, 2. ప్లక్ష ద్వీప ము, 3. కుశ ద్వీపము, 4. క్రౌంచ ద్వీపము, 5. శాక ద్వీపము, 6. శాల్మలీద్వీపము, 7.పుష్కర ద్వీపము.
జంబూద్వీపము ఒక లక్ష యోజనాల విస్తీర్ణము వుంటుంది. మిగిలిన ద్వీపాలు ఒకదానికొకటి రెట్టింపు వైశాల్యంలో వుంటాయి. ఆ సప్తద్వీపాల నడుమ ఒక లవణ (ఉప్పు), సముద్రం, 2.చెరకు (ఇక్షు) కడలి, 3. మద్య (మధు) సాగరం, 4 ఘృత (నెయ్యి) సముద్రం, 5. పాల కడలి, 6. దధి (పెరుగు) కడలి, 7. మంచినీటి కడలి అనే ఏడు సముద్రాలున్నాయి. సముద్రాలన్నీ కలిసిపోకుండా ద్వీపాల చుట్టూ అగడ్తలేర్పడ్డాయి. నదులను, కొండలను, వనాలను సరిహద్దులుగా నిర్ణ యించాడు. ద్వీపాలలో దేవ విభాగం కల్పించాడు. తన ఏడుగురు కొడుకులను ఒక్కొక్కరిని ఒక్కొక్క ద్వీపానికి రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. కూతురు ‘ఊర్జస్వతి’ని భార్గవుడు అనే అతనికి ఇచ్చి వివాహం చేశాడు. అరిషడ్వర్గాలను జయించిన ఉత్తమ పురుషు డు ప్రియవ్రతుడుకు ఇలాంటి అనేక మహత్తర కార్యా లను సాధించి పెద్ద కుమారుడైన అగ్నీధుడునకు పట్టా భిషేకం చేసి, తరువాత ప్రియవ్రతుడు భార్యా పిల్లలను విడిచి సర్వసంగ పరిత్యాగి అయి నిరంతర భగవ ధ్యా నంలో మునిగి కైవల్యాన్ని పొందాడు.

  • వై.వసంత
Advertisement

తాజా వార్తలు

Advertisement