Friday, November 22, 2024

పునీతులు కావడం అంటే…

పునీతులం అయ్యాం అనే మాట వినే ఉంటారు, ఇం తకీ పునీతం అంటే ఏంటి! ఈ ఐదు సూత్రాలను పాటిస్తే శత్రు వులుండరు, ప్రశాంతత కోల్పోరు, అనారోగ్యం పాలవరు, అపజయం అనే మాటే దరిచేరదు. వీటినే పంచ పునీతాలు అంటారు… అవేంటంటే.
పురాణాల్లో ఎక్కువగా వినిపించే మాట…పునీతం. నీ దర్శనంతో నా జన్మధన్యమైంది, పునీతులం అయ్యాం అనే మాట వింటుంటాం పునీతులం అవడం అంటే అదేమైనా హూదానా అంటే…ఇంచుమించు అలాంటిదే. ఎందుకంటే మన ప్రవర్తనతో సంపాదించుకునే ప్రత్యేక హూదా అది.
పునీతాలను ఐదు రకాలుగా చెబుతారు
1. వాక్‌ శుద్ధి
2. దే#హ శుద్ధి
3. భాండ శుద్ధి
4. కర్మ శుద్ధి
5. మనశ్శుద్ధి
వాక్‌ శుద్ధి: వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన భగవంతుడు మాట్లాడే వరాన్ని కేవలం మనిషికి మాత్రమే ఇచ్చాడు. అం దుకే వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిం దించకూడదు. ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే మీరు పక్కకు తప్పుకోండి కానీ వాదన పెట్టుకుని మాట తూలకుండా ఉండటమే వాక్‌ శుద్ధి.

దే#హ శుద్ధి: మన దే#హమే దేవాలయం అంటారు. అంటే శరీ రం అంత పవిత్రమైనదని అర్థం. దేవాలయాన్ని ఎంత పరిశు భ్రంగా ఉంచుతామో శరీరాన్ని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రెండు పూటలా స్నానం చేయాలి..చిరిగిన, అపరిశుభ్రమైన దుస్తులు ఎప్పుడూ ధరించకూడదు. అలా చేస్తే ఆ ఇంట దరిద్రం తాండవిస్తున్నట్టే…
భాండ శుద్ధి: శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం. అం దుకే ఆహారాన్ని వండే పాత్ర, అందించే పాత్ర కూడా పరిశు భ్రంగా ఉండాలి . స్నానం చేసి, పరిశుభ్రమైన పాత్రలో వం డి న ఆహారం అమృతంతో సమానం అంటారు పెద్దలు. స్నా నం చేయకుండా వండి ఆహారం తిన్నవారికి రాక్షస లక్షణా లు వస్తాయంటారు.
కర్మ శుద్ధి: కర్మ అంటే పని. ఏదైనా పని చేయాలని అనుకుంటే ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలి. మధ్యలో ఆపితే వారిని అధములు అని, అనుకున్న పనిని అస్సలు ప్రారంభించని వారిని అధమాధముడు అని… తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడని అంటారు.
మనశ్శుద్ధి: మనస్సును ఎప్పుడూ ధర్మం, న్యాయం వైపు మళ్ళించాలి. ఎందుకంటే చంచలమైన మనసు ఎప్పుడూ వక్రమార్గానికే ఆకర్షణ చెందుతుంది..అలాంటప్పుడే సమ స్యలొస్తాయి, కష్టం కలుగుతుంది, అయినవారిని బాధపెట్టిన వారవుతారు. అందుకే ఎవ్వ రికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మన:శుద్ధి. ఈ ఐదురకాలైన శుద్ధిని కలిగి ఉంటే చాలు…ఈశ్వర కటాక్షం కలుగకుండా ఉండదు అంటారు మన పెద్దలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement