Friday, November 22, 2024

కర్మబంధ విముక్తుడు బసవేశ్వరుడు!

సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలం గా వ్యతిరేకించిన అభ్యుదయ వాది బసవేశ్వరుడు. హందవ మతాన్ని సం స్కరించి, లింగాయత ధర్మాన్ని ఆయన స్థాపించారు. బసవేశ్వరుని బస వన్న, బసవుడు అని, విశ్వగురు అని పిలుస్తారు. వైదిక కర్మలంటే చిన్న తనం నుంచే ఆయనకు నచ్చేది కాదు. చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అవగతం చేసుకున్న బసవనికి కర్మకాండపై విశ్వాసం పోయింది. బసవనకు ఎనిమిదవ యేటనే తండ్రి ఉపనయనము చేయ నిర్ణయించగా, తాను కర్మ బంధనములను త్రెంచుటకై జన్మిం చానని, ఉపనయనము చేయుట వలదని వారించి, తల్లిదండ్రులను వదలి, కూడల సంగమ అనే పుణ్యక్షేత్రం చేరి, అక్కడున్న సంగమే శ్వరుణ్ణి నిష్టతో ధ్యానించారు. దేవుడు కలలో కనిపించి బసవనికి అభయమిచ్చాడని, దేవుని ఆనతి మేరకు, మంగళవాడ (కళ్యాణ పురం) చేరుకున్నారని చెపుతారు.
బసవన్న వచన సాహత్యంతో, ప్రజలందరినీ కులమతాలకతీతంగా ఏకం చేసారు. వీరశైవ మతానికి తిరిగి పట్టం కట్టిన బసవని ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి, ఆంధ్ర దేశంలోను వ్యాపించింది. ప్రతిరోజు లక్షాతొంభై ఆరు వేల మంది జంగములకు, మృష్టాన్నములతో అర్చించి, అనంతరం తాను భుజించేవాడని చెపుతారు. బసవడు తన ఉపదేశాలలోని సూక్ష్మమైన తత్త్వం ప్రజలకు సులువుగా బోధపడేలా రాశారు. హందవ మతాన్ని సంస్క రించిన ముఖ్యులలో ఆయన ప్రముఖులు. శివుడిని మించిన వాడులేడన్న విశ్వాసంతో, శివతత్వ ప్రచారానికి పూనుకున్నారు. అలా లింగాయత మతానికి బీజాలు వేశారు. శివుడంటే కనిపించని శక్తి అని విగ్రహారాధనను వ్యతిరేకించారు. కాయమే (శరీరం) కైలాసమని చాటి, శ్రమ జీవులకు అత్యంత గౌరవం తీసుకువచ్చారు. పాల్కురికి సోమనాధుడు రచించిన బసవే శ్వరుని దివ్య జీవితగాథ ‘బసవ పురాణం’ తెలుగు సా#హత్యంలో ప్రసిద్ధమయింది.
పలువురు ఆంధ్ర కవులు బసవనను ప్రశంసించారు. పోతన ‘వీరభద్ర విజయమున’ బసవుని స్తుతించుటయేగాక, ఆయన వచనములను అనుసరించినట్లు సాహతీ పరిశోధకుల అభిప్రాయం. ”కలియుగంబున కల్యాణ కటక నగరి నాదు భక్తుండు బసవర నాధుడొకండు”. అని శ్రీనాథుడు బసవుని ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement