శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం
శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.
ఈరోజు బలరాముని విశేషాలపై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
బలరాముడు
వసుదేవుడు, రోహిణీల పుత్రడు బలరాముడు. ఇతను ఆదిశేషుడు. శ్రీమన్నారాయణుడు ఎప్పడు అవతరించినా తన పరివారంతోనే వస్తాడు. రాముడిగా వచ్చినప్పుడు ఆదిశేషుడు లక్ష్మణుడిగా అవతరించాడు. రామావతారంతో తమ్ముడిగా సేవ చేసాడని కృతజ్ఞతతో స్వామి కృష్ణావతారంలో బలరాముడిని అన్నగా అవతరింపచేసి తాను సేవలు చేశాడు. ఆదిశేషుడు దేవకీ గర్భంలో ఉండగా కంసునికి సందేహాన్ని, అయోమయాన్ని సృష్టించడానికి యోగమాయతో దేవకీ గర్భం నుండి రోహిణీ గర్భానికి ప్రవేశింపచేశారు. కావున ఈయన పేరు సంకర్షణ. ఈవిధంగా రోహిణీకి కుమారుడిగా పుట్టి కృష్ణపరమాత్మునితో కలిసి రెపల్లెలో దుష్టశిక్షణలో పాల్గొన్నాడు. ధేనుకాసురుడు, ప్రలంభాసురుడు, మణిగ్రీవుడు ఇత్యాది రాక్షసులను రేపల్లెలో సంహరించాడు. దుర్యోధుని పుత్రిక వివాహ విషయంలో దుర్యోధనాదులతో వాగ్వాదానికి ఆగ్రహించిన బలరాముడు హస్తినాపురాన్ని యమునలో ముంచే ప్రయత్నంలో తన నాగలితో హస్తినాపురాన్ని పెకిలించి ఒక వైపుకు వంచాడు. భయపడిన కౌరవులు పాదాక్రాంతులు కాగా ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. దీనికి నిదర ్శనంగా ఢిల్లిd నగరం దక్షిణవైపుకు వంగి ఉంటుంది. జలవిహారానికి రమ్మని పిలవగా నిరాకరించిన యమునపై ఆగ్రహిం చిన బలరాముడు తన నాగలితో యమునను లాగగా రేపల్లె, మధుర, బృందావనం ప్రాంతాలలో యమున మూడు పాయలుగా చీలింది. మరోసారి తీర్థయాత్రలకు వెళ్లి ఋషుల యజ్ఞంలో పాల్గొనపుడు తాను వస్తే లేవలేదని కోపించి దర్బతో ఉగ్రసేనుడిని సంహరించి ఋషుల కోరిక మేరకు అతని కుమారుడు రోమహర్షనుడిని సూతిని చేసి పురాణ ప్రవచనధారను కొనసాగించినవాడు బలరాముడు. ఈ విధముగా ధర్మరక్షణ, దుష్టశిక్షణలో శ్రీ కృష్ణభగవానునికి తోడుగా ఉండి తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించి స్వామి సేవక సంబంధాన్ని నిర్వచించిన వాడు బలరాముడు. శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి
ధర్మం మర్మం (ఆడియోతో..)
Advertisement
తాజా వార్తలు
Advertisement