యోగీశ్వరులు గొప్ప పుణ్యాత్ములు. వారి హృదయ మందు వాసుదేవుడు వసించును. వారి సహవాసము లభించే భక్తులు గొప్ప అదృష్టవంతులు. అలాంటివా రు ఇద్దరు. తాత్యాకోతే పాటిల్, మహల్సాపతి. బాబా వారిద్దరిని సమానంగా ప్రేమించేవారు. ఈ ముగ్గురు మసీదులో తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి ఒకరి కాళ్లు ఒకరికి మధ్య తగిలేట్లు నిద్రించేవారు. పక్కలు పరచుకొని వానిపై చతికిలపడి సగం రాత్రివరకు ఏవో కబుర్లు చెప్పుకునేవారు. ఇలా పాత మసీదులో బాబా నేలపై పడుకోవడం చూసి నానాసాహెబు డేంగ్లే బాబా నిద్రించుటకు ఒక కర్రబల్లను తెచ్చెను. దాని పొడవు నాలు గు మూరలు, వెడల్పు ఒక జానెడు మాత్రమే వుండేది. ఆ బల్లను నేలపై వేసుకొని బాబా పడుకుంటారని డేంగ్లే తెచ్చా డు. బాబా అలాచేయడానికి బదులుగా దానిని మసీదు పైన వున్న దూలాలకు ఉయ్యాలవలే వేలాడునట్లు పాత చినిగిన గుడ్డపీలికలతో కట్టారు. దానిపై బాబా పడుకొనేవారు. గుడ్డపీలికలు పలుచగా, బలహీనంగా వున్నాయి. అవి బల్ల బరువును మోస్తాయా అని అందరికీ సందేహంగా, సమస్య గా వుంది. ఇక ఆ బల్లపై బాబా బరువు కూడా పడితే అవి ఎలా భరిస్తాయనేది అందరికి ఆశ్చర్యంగా, వినోదంగా, భయం గా వుండేది. ఇది బాబా లీలల్లో ఒకటి అవడంతో పాతగుడ్డ పీలికలే అంత బరువును మోసాయి. అంతేకాదు. ఆజాను బాహుడైన బాబా పడుకోవడానికి ఆ బల్ల సరిగ్గా సరిపోదు. ఇక బల్లపైన దీపాలు పెట్టటానికి ప్రదేశం ఎక్కడిది? కానీ బాబా ఆ బల్ల నాలుగు మూలలయందు నాలుగు దీపపు ప్రమిదలుం చి రాత్రి అంతా దీపాలు వెలిగించేవారు. చూసేవారికి అంతా చిత్రంగా వుంటుంది. బాబా బల్లపైన పడుకొనే ఆ దృశ్యాన్ని దేవతలు కూడా చూసి తీరాల్సిందే! ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కేవారు? ఎలా దిగేవారు? అనేది అందరికి ఆశ్చర్యంగా వుండేది. చాలామంది ఆ దృశ్యాన్ని చూడాలనే కుతూహలంతో ఉండేవారు. కానీ బాబా యెవరికి అంతు తెలియనివ్వలేదు. జనులు గుంపులు గుంపులుగా గుమి గూడేవారు. దాంతో విసుగుచెందిన బాబా ఒకరోజు ఆ బల్లను విరిచి పారేశారు. బాబా స్వాధీనములో అష్టసిద్ధులు ఉండేవి. బాబా వానిని అభ్యసించలేదు. వారు పరిపూర్ణులు గనుక అవి సహజ ముగానే వారికి సిద్ధించాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement