Saturday, November 23, 2024

ఇచ్చేది… పుచ్చుకునేది బాబానే!

పూనా జిల్లా, జున్నూరు తాలూకా నారాయణ గ్రామ వాస్తవ్యుడు అయిన భీమాజీ పాటిల్‌ కు ఒకసారి ఉపిరితిత్తుల వ్యాధి సోకి, క్రమం గా అది క్షయగా పరిణమించింది. వైద్య విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో క్షయవ్యాధిని మృత్యు ద్వారంగా పరిగణించేవారు. స్వతహాగా ధన వంతుడైన భీమాజీ ఎన్నో రకాల మందులు వాడా డు, ఎందరో ప్రసిద్ధమైన డాక్టర్లకు చూపించాడు కాని ఆ వ్యాధి ఇసుమంతైనా తగ్గలేదు. ఇక ప్రాణం మీద ఆశ వదులుకొని ”ఓ భగవంతుడా నీవే నాకు దిక్కు” అని రాత్రింబవళ్ళూ అతి దీనంగా ప్రార్ధించసాగాడు.
అతని ప్రార్థనలు ఆ సాయికి చేరాయా అన్నట్టుగా ఆ తర్వాత భీమాజి తన అనారోగ్యం వివరాలను సా యి భక్త శిఖామణి నానాచందోర్కర్‌కు రాసాడు. అం దుకు నానా ”అన్ని వ్యాధులకు ఏకైక నివారణ సర్వ స్య శరణాగతిచేసి సాయి పాదాలపై పడుటయే” అని సమాధానమిచ్చాడు.
అప్పుడు భీమాజీ నానా సలహాపై ఆధారపడి తన బంధువుల సహాయంతో శిరిడీకి వచ్చి మసీదులో బాబా కాళ్ళపై పడి తన వ్యాధి తగ్గించమని ప్రాధేయ పడ్డాడు. ఈ వ్యాధి అతని గతజన్మ ప్రారబ్ద ఫలితమ ని, ఆ పాపములను అనుభవించి వాటి నుండి విము క్తి అవ్వడమే సరైన మార్గమని, అందువలన ఈ విష యంలో తాను కలుగజేసుకొనడంలేదని బాబా ఖచ్చి తంగా చెప్పేసాడు.
ఆ మాటలకు #హతాశుడైన భీమాజీ తనకు వేరే దిక్కు లేదని, సాయి కల్పించుకోకపోతే ఇక మరణమే శరణ్యమని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ సాయిని ప్రార్ధించాడు. అతని పరిశుద్ధమైన ప్రార్ధనకు బాబా హృదయం కరిగింది. అపుడు భీమాజీతో సాయి ”ఊరుకో. నీ ఆతృతను పారద్రోలుము. నీ కష్టము లన్నీ గట్టెక్కే సమయం వచ్చింది. ఎంతటి బాధలు న్నవారైనా తల్లి వంటి ఈ మసీదు మెట్లెక్కితే వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషానికి దారితీస్తాయి.
ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయామయుడు. నీ రోగ మును తప్పక బాగు చేయును” అని ప్రేమపూర్వక పలుకులు పలికారు. ఆ కమ్మని పలుకులతో భీమాజీ కి కొండంత ఊరట కలిగినట్లయింది. అప్పటివరకూ ప్రతి అయిదు నిమిషాలకూ రక్తం కక్కుతున్న అతను సాయి సుముఖంలో ఒక్కసారి కూడా రక్తం కక్కలే దు. సాయి వానికి నిన్ను కాపాడతాను అని దయతో అభయం ఇచ్చినప్పటినుండి భీమాజి జబ్బు నయ మవడం ఆరంభించింది. అతనిని భీమాభాయి అను వారి ఇంట వుంచమని సాయి సలహా ఇచ్చారు. ఆ ఇంటికి గాలి, వెలుతురు సరిగ్గా వుండక ఏమంత సౌకర్యంగావుండదు. క్షయ రోగంతో బాధపడే వారికి ఆ ఇల్లు అసలు పనికిరాదు.

కాని సాయి వాక్కు బ్రహ్మవాక్కుతో సమానం. ఆ రాత్రి అతనికి రెండు స్వప్నాలు వచ్చాయి. మొదటి స్వప్నములో భీమాజి ఒక పాఠశాల విద్యార్ధిగా వున్నాడు. టీచరు చెప్పిన పద్యాలను కంఠస్థం చేయకపోవడం వలన టీచరుగారు అతడిని తీవ్రంగా దెబ్బలుకొట్టారు. రెండవ స్వప్నంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు భీమాజీ ఛాతీపై పెద్ద బండను వేసి కిందకి, మీదకు తొక్కడం వలన ఛాతిలో నొప్పి ఎక్కువగా వచ్చి భీమాజీ తీవ్రమైన బాధ అనుభ వించాడు. కలలో పడిన ఈ బాధలతో అతని జబ్బు పూర్తిగా నయమైపోతుంది.కొద్దిరోజులలోనే శ్రీ సాయి ఊదీ ప్రసాదాలను తీసుకొని ఆనందంగా తన బంధు వులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు.
సాయినాథులు తనకు చేసిన ఈ మేలును మరువక ప్రతినెలా శ్రీ సాయి సత్యవ్రతం అనే వ్రతాన్ని అత్యం త భక్తిశ్రద్ధలతో చేసుకోసాగాడు. ఈవిధంగా శ్రీ సా యినాథులు తమదైన శైలిలో తన భక్తుని వ్యాధిని తగ్గించి వేసారు. సాయి తాను తన భక్తులకు చేసిన మేలుకు ప్రతిఫలముగా ఏమీ ఆశించేవారు కాదు. వారికి కావలసింది భక్తులు తాము పొందిన మేలును గుర్తుంచుకొని తనపై అచంచలమైన నమ్మకం కలిగి ఉండడమే! తనకు సర్వస్య శరణాగతి చేసిన భీమా జీ కిందటి జన్మలో చేసుకున్న ప్రారబ్దకర్మలు సైతం తప్పించి, మందులు ఆపరేషన్‌ లేకుండా కేవలం స్వప్నానుభవములతో అతి దుర్లభమైన అతని వ్యాధి ని తగ్గించి పరిపూర్ణ ఆరోగ్యవంతుని గావించి తద నంతరం సుఖవంతమైన నూతన జీవితం ప్రసాదిం చిన కరుణామూర్తి శ్రీ సాయి. సాయి కరుణను, అపా రమైన అనుగ్ర#హంపొందాలంటే ఆడంబరమైన భజ నలు, ఆర్భాటమైన పూజలు, యజ్ఞయాగాదులు అవ సరం లేదు. పరిశుద్ధమైన మనస్సు, ఇచ్చేది, పుచ్చు కునేది ఆ సాయియే అన్నదృఢమైన నమ్మకం చాలు.
– సిహెచ్‌.ప్రతాప్‌, 9136827102

Advertisement

తాజా వార్తలు

Advertisement