Sunday, November 17, 2024

బాబా భిక్షాటన…ఓ సందేశం!

షిరిడీ ప్రజలు ఎంతో పుణ్యాత్ములు. వారి ఇంటికి వ చ్చి బాబా భిక్షకుని వలె నిలి భిక్ష అడిగేవారు. ప్రతీ రోజూ కొన్ని ఇల్లకు మాత్రమే వెళ్ళేవారు. బాబా కాల పరిమితి వుండేది కాదు. బాబాకు రుచి అనునది లేదు. వారు తన నాలుకను స్వాధీనంలో వుంచుకొనేవారు. పదార్థాలు రుచిగా వుండాలని ఎప్పుడూ అనుకునేవారు కాదు. అందుకే భిక్షాటనలో అన్ని పదార్థాలను జోలెలోను, చేతిలో వున్న తం బిరేకు డబ్బాలోను వేయించుకునేవారు. అవి అన్నీ కలిసిపో యినా తిని ఎంతో సంతృప్తిచెందేవారు. ఆయన తినే సమ యంలో కుక్కలు, పిల్లులు వచ్చి తింటున్నా కూడా ఏమీ అనే వారు కాదు. మసీదును శుభ్రంచేసే స్త్రీలు రొట్టెలు తీసుకున్నా ఏమీ అనేవారు కాదు. ఆకలి బాధతో వున్న మూగజీవులకే కా దు… ఆకలి బాధతో వున్న మానవులకు కూడా అడ్డు చెప్పలే దు. అంతటి మహోన్నతమైనది… అత్యంత పావనమైనది సాయిబాబా మనస్సు.
పరబ్రహ్మ స్వరూపుడు అయిన సద్గురు సాయిబాబా జీవితమంతా భిక్షాటన చేస్తూనే గడిపారు. తనను ఆశ్రయిం చినవారందరి కష్టాలు తీర్చి, వారి ఆకలిని తీర్చే సాయిబాబా భిక్షాటన చేసి జీవించడం చూసిన షిరిడీ ప్రజలు కొందరు మొదట పిచ్చి ఫకీరు అనుకునేవారు. కొంతమంది బాబాను మహానుభావునిగా గుర్తించారు. బాబాకు భిక్ష వేయడానికి తహతహలాడేవారు. ఎంతో ప్రేమతో రెండు విధాలైన ప్రశ్న లకు సమాధానాలు దొరుకుతాయి. మొదటిది అసలు భిక్షాట న చేసి జీవించే హక్కు ఎవరికి వుంది? రెండవది మానవుడు జీవిత కాలంలో అయిదు పాపాలు చేస్తాడు వాటిని పోగొట్టు కొనే మార్గాలు ఏమిటి? అనే రెండు ప్రశ్నలకు సమాధానము చెప్పవచ్చు.
ఎవరైతే ధనము, సంతానము, కీర్తి, సంపాదించుట యందు ఆపేక్ష వదలుకొని సన్యసిస్తారో వారు భిక్షాటన చేసి జీవించవచ్చునని మన శాస్త్రములు తెలుపుతున్నాయి. సన్య సించినవారు ఇంటివద్ద వంట చేసుకొని తినలేరు. వారికి భోజనము పెట్టే బాధ్యత గృహస్థులపై వుంటుంది. సాయిబా బా గృహస్థుడు కాడు, వానప్రస్థుడు కూడ కాడు. వారస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యము నుండి బ్రహ్మచర్యమునే అవలం బించుచుండిరి. ఈ జగత్తు అంతా తన గృహమే అని బాబా భావించేవారు. సాయిబాబా ఈ జగత్తుకు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి వుంది. వారు పరబ్రహ్మ స్వరూపు లు. కాబట్టి వారికి భిక్షాటన చేసే హక్కు పూర్తిగా వుంది.
గృహస్థులు భోజన పదార్థాలను తయారుచేసే సమ యంలో అయిదు పనులను తప్పకుండా చేయాలి. అవి- 1. దంచుట, రుబ్బుట, 2. విసరుట, 3. పాత్రలు తోముట, 4. ఇల్లు ఊడ్చుట, తుడుచుట, 5. పొయ్యి వెలిగించడం. ఈ అయిదు పనులు చేసేటప్పుడు అనేక క్రిమికీటకాలు మరణి స్తాయి. గృహస్తులు ఈ పాపాన్ని అనుభవించాలి. ఈ పాప పరిహారార్థమై మన శాస్త్రాలు ఆరు మార్గాలను తెలియజేసా యి. అవి- 1. బ్రహ్మ యజ్ఞము, 2. వేదాధ్యయనము, 3. పితృ యజ్ఞము, 4. దేవ యజ్ఞము, 5. భూత యజ్ఞము, 6. అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞాలు నిర్వర్తిస్తే గృహ స్తులు పాపరహితులు అవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు మోక్ష సాధనకు, ఆత్మసాక్షాత్కారానికి ఇవి తోడ్ప డతాయి. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడగడంతో ఆ ఇంటిలో ని వారికి వారు చేయవలసిన కర్మను బాబా గుర్తు చేసేవారు. షిరిడీ ప్రజలకు వారి ఇంటి గుమ్మం వద్దనే బాబా ఇంతటి గొ ప్ప బోధనలను చేసేవారు. సాయిబాబాకు భిక్ష వేసే మహద్భా గ్యం కలిగిన షిరిడీ వాసులు ఎంతో అదృష్టవంతులు.
అత్యంత శ్రద్ధాభక్తులతో ఎవరు ఏదీ ఇచ్చినా తీసుకునే వారు సాయిబాబా. శ్రీకృష్ణుడు భగవద్గీతలో శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రం, పుష్పం, ఫలం, నీరు ఏది అర్పించినా దానిని తాను గ్రహిస్తానని చెప్పాడు. అలాగే సాయిబాబా కూడా తన భక్తులు ఏది సమర్పించినా సంతోషంగా తీసుకునేవారు. తన భక్తులు తనకు ఏదైనా సమర్పించాలని అనుకుని మరిచిపోతే వారికి గుర్తుచేసి మరీ బాబా తీసుకునేవారు. వారిని ఆశీర్వ దించేవారు. తన భక్తురాలు సమర్పించాలనుకున్న పదా ర్థాలను బాబా ఎలా స్వీకరించారో తెలిపే ఓ చక్కని కథ ఇది.
ఆత్మారాముని భార్య బాబాకు వంకాయ వేపుడుకూర, వంకాయ పెరుగుపచ్చడి బాబాకు నైవేద్యం పెట్టాలని అను కుంది. ఒకసారి బాంద్రా నుంచి షిరిడీ వెళుతున్న రఘువీర భాస్కరపురందరే భార్యకు ఆత్మారాముని భార్య పెద్దవంకా యలు ఇచ్చింది. వాటితో బాబాకు వంకాయ పెరుగుపచ్చడి, వేపుడు చేసి వడ్డించమని కోరింది. షిరిడీ చేరిన వెంటన పురం దరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి చేసి బాబా భోజనానికి కూర్చున్నప్పుడు తీసికొని వెళుతుంది. బాబాకు ఆ పచ్చడి బాగా నచ్చింది. అందరికీ పంచిపెట్టి తిన్నారు. బాబా వంకా య వేపుడు కూడా అప్పుడే కావాలని అడిగారు. ఈ సంగతి రాధాకృష్ణమాయికి తెలియపరిచారు. అది వంకాయ కాలం కాదు ఏమిచేయాలని ఆలోచించారు. వంకాయ పచ్చడి ఎవరో కనుక్కుంటే పురందరుని భార్య అని తెలియడంతో ఆమెనే వంకాయ వేపుడు కూడా చేసిపెట్టాలని నిర్ణయిం చారు. అప్పుడు అందరికి బాబా వంకాయ వేపుడు ఎందుకు కావాలని అడిగారో తెలిసింది. బాబా సర్వజ్ఞతకు అక్కడ వున్న అందరూ సంతసించి, బాబాకు భక్తితో నమస్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement