ఈ కలియుగంలో అనేక విధములైన పాపాలను చేస్తూ, వివిధ రకములైన సమస్యలతో, ఆందోళనలతో నిత్యం సత మతమయ్యే మానవాళికి వారి కష్టాలు, కన్నీ ళ్ళు, చింతనలు దూరం కావడానికి శ్రీ సాయి పాదాలను శరణు వేడడమే అతి సులభమైన పరిష్కారం. అటువంటి మార్గంలో ప్రయా ణించి, శ్రీ సాయి కృపకు పాత్రలైన ఖపర్డే దం పతుల వృత్తాంతము తెలుసుకుందాము.
అమరావతి నగరంలో దాదా సాహబ్ ఖపర్డే అనే గొప్ప లాయర్ వుండేవాడు. ఆతను గొప్ప ధనవంతుడు, అద్భుతమైన తెలివితేట లు గలవాడు, ఎటువంటి క్లిష్టమైన కేసులనైనా వాదించి గెలవగల సమర్ధుడు. బాలగంగా ధర్ తిలక్‌కు ప్రియమైన శిష్యుడు. అంతకంటే ఎక్కువగా బాబాకు కూర్మి భక్తుడు. బాబా భక్తు లలో అనేకమంది బాబాతో తరచుగా వాదులా డేవారు, కాని బ్రహ్మజ్ఞాని అయిన బాబా సమ క్షంలో ఖపర్డే నోరు మెదిపే వాడు కాదు. అనేక వేదశాస్త్రాలను పారాయణ చేసి, పంచదశి వం టి అద్భుతమైన గ్రంథాలను ఇతరులకు బో ధించే ఖపర్డే బాబా అవతార వైశిష్టం గ్రహం చినవాడు కావున ఆయన ముందు నోరెత్తడా నికి సాహసించేవాడు కాదు. ఆసలైన భక్తుడు ఎలా ప్రవర్తించాలో ఖపర్డే ఆచరణ పూర్వకం గా చూపించాడు. ఖపర్డే భార్య బాబాను దర్శిం చుకుందా మని శిరిడీకి వచ్చి అక్కడ ఏడు నెల లు వుంది. ఆమెకు బాబా యందు విశేషమైన భక్తిశ్రద్ధలు వున్నాయి. ప్రతి రోజూ, తన చేతుల మీదుగా వండిన ఆహారమును నైవేద్యం కోసం మశీదుకు తీసుకు వస్తుండేది. బాబా దానిని స్వీకరిం చి, పావనం చేసిన తరువాత మాత్రమే ఆమె భోజనం చేస్తుండేది. అటు సూర్యుడు ఇటు పొడవవచ్చునేమోగాని ఖాపర్డే భార్య మాత్రం తన క్రమం తప్పేది కాదు. బాబా ఆమె భక్తిశ్రద్ధలకు సంతోషించి, ఆమె నిలకడ భక్తిని ఇతర భక్తులకు మోదించ సంకల్పించారు.
ఒకనాడు ఖపర్డేభార్య మధ్యాహ్న భోజన సమయంలో పళ్ళెంలో ఆహార పదార్ధాలను తీసుకువచ్చి బాబా ముందు పెట్టి చేతులు జోడించి నిలబడింది. ఇతర భక్తులతో మాట్లా డుతున్న బాబా వెంటనే ఆ పళ్ళెమును అందు కొని త్వరత్వరగా తిననారంభించారు. ఈ దృశ్యాన్ని చూసిన ఇతర భక్తులు విస్మయానికి లోనయ్యారు. బాబా ముఖ్య భక్తుడైన శ్యామా బాబాతో ”ఓ దేవా! ఈ రోజున ఎందుకు ఈవి ధంగా పక్షపాత వైఖరిని చూపిస్తున్నావు? ఇత రుల పళ్ళెములను చూడనైనా చూడకుండా నెట్టి వేస్తా వు, కాని ఈమె తెచ్చిన భోజనమును ఎందుకంత ప్రేమతో తినుచున్నావు?” అని అడిగాడు. అప్పుడు బాబా ”చూడండి నాయ నలారా! ఈ భోజనం నిజానికి చాలా అమూల్య మైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఇంట్లో ఆవుగా జన్మించింది. ఆ ఆవు ఇచ్చే పాలతో ఆ వర్తకుడు నా పూజాది కార్యక్రమాలను బహు చక్కగా నిర్వర్తించేవాడు. తదుపరి జన్మలో ఈమె ఒక తోటమాలి, ఆ పై జన్మలో ఒక క్షత్రి యుని ఇంట్లో జన్మించి ఒక భాగ్యవంతుడైన, నా భక్తుడైన వర్తకుడిని వివాహమాడింది. తరువాత ఒక బ్రాహ్మణుని ఇంట్లో జన్మించిం ది నా మరొక భక్తుని వివాహమాడింది. చాలా జన్మల తరువాత ఈమెను చూస్తున్నాను కాబట్టి ఆమెపై ఎనలేని ప్రేమతో ఆమె తెచ్చిన అన్నమును తింటున్నాను. ఇంకా ప్రేమమ యమైన కొన్ని ముద్దలను తిననివ్వండి” అం టూ బాబా త్వరత్వరగా ఆ పళ్ళెమును ఖాళీ చేసారు. నోరు, చేతులు కడుగుకొని, తిరిగి తన గద్దెపై కూర్చొని ఖపర్డే భార్యను దగ్గరకు రమ్మ ని పిలిచారు. ఆమె బాబా దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళను వత్తసాగింది. ఆమె యదార్ధమైన ప్రేమకు బాబా సంతోషించి ఆమెతో మెల్లగా ”నువ్వు రాజారాం అనే మంత్రాన్ని ఎల్లప్పు డూ జపిస్తూ వుండు. నీ జీవితాశయమును పొందుతావు. నీ మనస్సు, చిత్తము శాంతిస్తా యి.” అన్నారు. అదియే శక్తిపాతము. బాబా తన శిష్యులకు ఆధ్యాత్మిక జాగృ తిని కలిగించే విధానము. ఈ యోగ ప్రక్రియ ద్వారా తన శక్తి ని సాధకుని సహస్రార చక్రం నుండి శరీరంలో నికి పంపించి కుండలినీ జా గృతిని కలిగిస్తారు. బాబా చెప్పిన విధంగా ఖపర్డే భార్య ఆ మంత్రా న్ని జపిస్తూ, అనుక్షణం బాబా నామస్మరణతో, బాబా పూజాది కార్యక్రమాలను నిర్వర్తిస్తూ, ఆధ్యాత్మిక అనుభవాలను పొంది చివరకు బాబాలో ఐక్యమయ్యింది. దీనిని బట్టి బాబాకు తన భక్తుల పూర్వజన్మల గురించి అన్ని తెలుసు ననీ, క్రితం జన్మలో తన భక్తులైనవారిని ఈ జన్మలో అతి చాకచక్యంగా తన వద్దకు లాగు కొని వస్తారని అర్ధమౌతోంది. ఒక సాధారణ గృహస్తు స్త్రీని తన వద్దకు రప్పించుకొని, తగు రీతిన ఆధ్యాత్మిక బోధలను చేసి, శక్తిపాతం గావించి, సాధనలు చేయించి ఆమెకు ముక్తిని ప్రసాదించిన వైనం అత్యద్భుతం, అపూర్వం.
శిష్యులకు బాబా ఆధ్యాత్మిక జాగృతి
Advertisement
తాజా వార్తలు
Advertisement