Tuesday, November 26, 2024

సర్వ శుభాలనిచ్చే కార్తీక సోమవార వ్రతం

పూర్వం యమునానది తీరంలో పరమపావనమైన ఒక దివ్యదేశాన్ని చిత్రవర్మ అనే రాజు పరిపాలన చేసేవాడు. స్కాందపురాణంలో ఇది కృతయుగానికి సంబంధించి న కథగా చెప్పబడుచున్నది. చిత్రవర్మ రాజుకి మొత్తం ఎనిమిది మంది పుత్రులు, చివ రగా ఒక పుత్రిక కలిగింది. ఇంతమంది పుత్రులు తరవాత అమ్మాయి పుట్టింది కాబట్టి చిత్ర వర్మకు ఈమె అంటే అధిక వాత్సల్యం, అందువల్ల ఈ రాజు జ్యోతిష్య శాస్త్రవేత్తలను పిలి పించి జాతకం మొత్తం చూపించి భవిష్యత్తు ఎలా ఉంటుంది? అని అడిగాడు.
జ్యోతిష్యులు ఈమె జాతకాన్ని పరిశీలించిన పిమ్మట ఈమె అన్ని సౌభాగ్యాలతోను భాసిల్లుతుంది కాబట్టి ఈమెకు ‘సీమంతిని’ అని పేరు పెట్టండి అని తీర్మానించారు. ఆ తర్వా త వాళ్ళు ఆమె జాతక ఫలాలు ఈవిధంగా చెప్పారు, ఈమె గొప్ప స్త్రీ అవుతుందని, సరస్వతీ వలె అన్ని కళలలోనూ రాణిస్తుందని, రతీదేవి వంటి సౌందర్యము, దమయంతి వంటి పాతి వ్రత్య శోభ, అరుంధతి వంటి తేజస్సు ఉంటుందని ఇలా అనేక రకముల వివరించారు. ఈమె ఆయుష్షు, సౌభాగ్యము గొప్పది అని చెప్పారు. ఐతే ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే పండితు లందరూ ఇదే అభిప్రాయం చెబితే ఒక్కరు మాత్రం, వీళ్ళందరూ చెప్పారు కానీ, నాకు మాత్రం జాతకంలో ఒక దోషం కనబడుతున్నది. అదేమంటే వివాహమైన కొద్ది కాలానికే ఈమె భర్తను కోల్పోవలసి రావచ్చును అని సూచన చేశాడు రాజుకి, ఈ మాట వినగానే రాజు హతాశుడయ్యాడు. కాలము గడుస్తోంది పాప పెరిగేకొద్ది చదువులో, శాస్త్ర గ్రంథాలలో ప్రావీణ్యం సంపాదించింది.
ఒకరోజు హఠాత్తుగా ఈమె చెలికత్తెలలో ఒక ఆమె ఇలా చెప్పింది. ”చిన్నప్పుడు మీ నాన్నగారు నీ జాతకం జ్యోతిష్యులకు చూపించినప్పుడు ఒక వార్త విన్నాము నీకు తెలుసా” అని అడిగింది. నాకు తెలియదు అని చెప్పింది. అమ్మాయికి ఈ విషయం తెలియనివ్వలేదు ఆమె తండ్రి. స్త్రీ చాపల్యం చేత ఆ చెలికత్తె చెప్పేసింది. ”నీకు వివాహమైన కొద్దికాలానికే భర్త దూరం అవుతాడట అని. ఈ మాటలు విన్న తర్వాత ఆమె చాలా బాధపడింది, ఎందుకంటే వివాహ వయసు దగ్గరకు వస్తున్నది ఆమెకి. ఇప్పుడు ఏమి చేయాలా? అని ఆమె ఆలోచిస్తూ ఉండగా, ఒక ఆలోచన వచ్చింది, గురువులను ఆశ్రయించాలని. ఇది చాలా ముఖ్యమైన విషయం కనుక ఏ సమస్య వచ్చినా భయపడకుండా ఎలా పరిష్కరించుకోవాలో తెలుసు కోవాలి, ఎందుకంటే శాస్త్రములో సమస్యలతో పాటు పరిష్కారమార్గాలు చాలా ఉంటాయి.
వెంటనే ఈమె వాళ్ళ గురువైన యాజ్ఞవల్క్య మహాముని భార్య మైత్రేయిని ఆశ్ర యించింది. ఉపనిషత్తులలో ఈమె గురించి చెప్పబడుతున్నది. ఈమె గొప్ప బ్రహ్మజ్ఞాన సం ప న్నురాలు. మైత్రేయి తల్లి! ఏమిటి నీ కోరిక? అనగా అప్పుడు ఆమె పాదములకు నమ స్కరించి ఇలా అడిగింది ”తల్లి ఏ సత్కర్మ వల్ల చక్కని సౌభాగ్యం వర్ధిల్లుతుందో దీర్ఘ సుమం గళిత్వం లభిస్తుందో ఆవిధమైన సత్కర్మను చెప్పుము. ఎందుకనగా గురువుద్వారా వచ్చిన ఉపాయాన్ని అద రించిన వారు ధన్యులవుతారు కనుక నిన్ను శరణు వేడుతున్నాను కరుణించి దీర్ఘ సుమంగళీ అగునట్లు అనుగ్ర#హం కావలెను”. అప్పుడు మైత్రేయి, ఓ రాజ కన్యా! విను, నీలకంఠుడైన పరమేశ్వరునితో ఉన్న గౌరీదేవిని ఆరాధించాలి. పగలంతా నియ మబద్ధంగా శివస్మరణం చేసుకుంటూ, శివసంబంధమైన శాస్త్రములు ఏమి చెప్పాయో, తెలుసుకుని కపటము లేని #హృదయంతో ఆరాధన చేయాలి. ఆరాధన చేసేటప్పుడు శివ, గౌరీ అష్టోత్తర శతనామావళితో శివపార్వతులను ఇద్దరిని కలిపి ఆరాధించాలి.
పూజ అనంతరం పవిత్ర జీవనం గడిపేవారికి భోజనం పెట్టి, ముత్తైదువులకు పసుపు, కుంకుమ, వస్త్రములు ఇచ్చి ఆరాధిం చాలి. ఇలాచేసే సమయంలో ఏవైనా ఆపదలు, సమస్యలు రావచ్చు అయినప్పటికీ చలించ కూడదు. ప్రారబ్ధకర్మ తప్పించుకోవాలని చేసే వ్రతములలో పరీక్షలు అధికంగా ఉంటాయి. అయినా వాటిని తట్టుకుని ఆచరిస్తే శుభఫలితాలు కలుగుతాయి. ఇలా శివపూజ మహత్యం వల్ల ఎలాంటి సంఘటన నుంచైనా బయటపడతారు. అని తనకు ఉపదేశం చేసిన, గురు స్వరూపిణీ మైత్రేయికి, నమస్కరించి వ్రతం ఆచరించడం మొదలుపెట్టింది. అప్పటికి ఇంకా వివా#హం నిశ్చయం కాలేదు. కన్యగా ఉన్నప్పుడే గురువుల ద్వారా గ్రహంచి వ్రతా చరణ చేయడం మొదలుపెట్టింది. నిత్యము సోమవార వ్రతం చేస్తున్నది.
ఇంతలో తండ్రి చక్కని ఒక సంబంధాన్ని తీసుకువచ్చాడు. నల చక్రవర్తి కృతయుగం నాటి రాజు ఆయన భార్య దమయంతి, ఆ పుణ్యదంపతుల పుత్రుడు ఇంద్రసేన మహారాజు. ఆ ఇంద్రసేన తనయుడు చంద్రాంగదుడు. అద్భుతమైన సౌందర్యం కలిగినటు వంటివా డు. ఈ సంబంధం బాగా నచ్చింది, నిశ్చయమైంది. వివా#హం జరిగింది.
వివా#హం జరిగిన కొద్ది రోజులకే చంద్రాంగదుడు, యమునానదీ తీరంలో తన పరి వారంతో సహా విహరిస్తున్న సమయంలో యమునానది పొంగు ఉదృతమై పడవ కొట్టుకుపోయింది. వార్త వెంటనే రాజుగారికి తెలిసి ఎంతో విలపించారు. ఈ సంఘటనకు పుర ప్రజలందరూ బాధపడ్డారు. అందరి మృతదేహాలు వచ్చాయి కానీ చంద్రాంగదుడి మృతదేహం రాలేదు. కూతురికి ఈ మాట రాజు చెప్పలేక చెప్పినప్పటికీ, గురువాక్యము మీద సంపూర్ణ విశ్వాసముతో శివారాధన కొనసాగిస్తూ భక్తిశ్రద్ధలతో ఉన్నది. వార్త తెలిసిన మహారాజు చాలా దు:ఖంలో ఉండిపోయాడు. రాచకార్యములు కూడా విస్మరించాడు. ఇదే అదునుగా అతని దాయాదులు అతన్ని బంధించి, రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె మాత్రం చెక్కుచెదరకుండా శివారాధన చేస్తోంది. అలా మూడు సంవత్సరములు గడిచిపోయాయి.
యమునా నదిలో మునిగిపోయిన చంద్రాంగదుడు చిత్రంగా ఆ నది యొక్క లోతు ల్లోకి వెళ్ళిపోతూ ఉండగా, కొందరు నాగకన్యలు చూసి నాగలోకానికి తీసుకువెళ్లి ఉచితమై న ఉపచారములు చేసి, విశ్రాంతి ఇవ్వగా, అక్కడికి నాగ రాజ్యాన్ని పాలించే తక్షకుడు వచ్చి నువ్వు ఏ దేవతను ఆరాధిస్తావు అని అడిగాడు. అప్పుడు తన ఇష్టదైవాన్ని తలచుకుని చంద్రాంగదుడు ”ప్రపంచానికి, దేవతలకు కూడా ఎవరైతే దేవుడో, ఎవడు ఈశ్వరుడో ఆ సర్వేశ్వరుడు నాకు ఇష్టదైవము” అని చెప్పాడు. అందుకు తక్షకుడు సంతోషించి మా ఆతి థ్యం స్వీకరించి ఇక్కడే ఉండిపొమ్మని చెప్పాడు. చంద్రాంగదుడు ”ఎన్ని ఉన్నప్పటికీ నాకు ఇది విదేశమే, నా దేశానికి వెళ్ల ఏర్పాటు చేయమని” ప్రార్థించాడు.
అప్పుడు తక్షకుడు అన్ని ఏర్పాట్లుచేసి తన పరివారము మరియు ఒక గుర్రాన్ని ఇచ్చాడు. అది ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళగలదు. అన్నీ స్వీకరించి తన దేశానికి బయలుదేరాడు. తిరిగి వచ్చిన భర్తను చూసి సీమంతిని ఆనందించింది. అది కూడా ఎలాగంటే ఆ రోజు సోమవారవ్రతం చేసి శివుని యొక్క పార్ధివ లింగాన్ని యమునా నదిలో కలపడానికి వెళుతుండగా గుర్రం మీద వస్తూ కనపడ్డాడు భర్త. శివపూజ మ#హమ వల్ల తిరిగి తన భర్తను పొందింది. తండ్రిని బంధించిన శత్రువులను ఓడించి తిరిగి తండ్రికి చెరసాల నుండి విముక్తి కలిగించాడు. సోమవారం వ్రతాన్ని నిష్టగా ఆచరించి ఎంతోమంది కష్టాల నుండి దూరమయ్యారు.
ఆ విధంగా అందరూ కలిసి శివారాధన చేసి ధన్యులయ్యారని సోమవారవ్రత మ#హ మని బ్రహ్మోత్తర ఖండం తెలియచేస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement