Monday, November 18, 2024

ఆత్మభావనా నగరం ఆరోవిల్లి

”ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట, ఏ దేశమూ తనదని చెప్పుకొనేందుకు వీలు లేని, ఏ ప్రభుత్వా నికీ చెందని ఒక ప్రదేశం ఉండాలి. అం దులో కేవలం పరమ సత్యం కోసం, దాని అభివ్యక్తి కోసం మాత్రమే జీవించే వారు ఉంటారు. అక్కడి వారంతా ప్రపంచ పౌరులుగా జీవిస్తారు. పరమసత్యం యొక్క అధికారానికి తప్ప వేరెవరికీ తల ఒగ్గి జీవించాల్సిన అవ సరం అక్కడ ఉండదు. అక్కడ నివసించే వారంతా కోరికల కోసం, వాంఛా పరి పూర్తికి, భౌతిక ఆనందాలు, ప్రాపంచి క సుఖాల కోసం ప్రయత్నించరు. తమలోని బలహీనతలను, లోపాలను అపరి పూర్ణతలను తమంత తామే గుర్తించి, వాటిని అధిగమించేందుకు కృషి చేస్తారు.” అని శ్రీమాత తన చిరకాల స్వప్నమైన ఆరోవిల్లి గురించి చెబుతారు.
అక్కడ అందరూ శాంతి, సమత, సామరస్యం, మైత్రి భావం తో జీవిస్తూ, వాటిని అంతకంతకూ వికసింప జేసుకుంటారు. ఆ సీమలోని బాలబాలికలు సహజంగా తమలో ఉన్న అంతరాత్మతో సంబంధాలను సమగ్రంగా వికసించేందుకు విద్యను అభ్యసిస్తారు. అక్కడ ఏ ఒక్కరికీ ధన సంపాదన ఆవశ్యకత ఉండదు. అక్కడ అం దరి అవసరాలను తీర్చిదిద్దే వ్యవస్థ ఒకటుంటుంది. వారివారి అభి రుచులు, ప్రావీణ్యత, అర్హతలను బట్టి అక్కడ అందరికీ పని కల్పించ బడుతుంది. వ్యక్తిత్వ వికాసం, సామాజిక వికాసం, పరమేశ్వరాభి వ్యక్తం వీటిని సాధించటమే వారి జీవితాలకు పరమ లక్ష్యం గా ఉంటుంది. పోటీ మనస్తత్వం, అధికారం కోసం ఆర్తి, ఆరాటం, పెనుగులాటలు అక్కడ ఉండవు. లలితకళల పట్ల వారికి గల ఆసక్తిని బట్టి వీటిని ఆస్వాదించడానికి, అభ్యసించడానికి అక్కడ అన్ని సదుపాయాలుంటాయి. తమ నాగరికతనూ, సంస్కృతినీ పోగొ ట్టుకొనే అవసరం లేకుండా అందరూ శాంతి సామరస్యాలతో కలిసి జీవిస్తారు. భిన్నత్వంలోని ఏకత్వం ఎల్లవేళలా కనిపిస్తుంది.
‘ఆరోవిల్లి’ ప్రారంభోత్సవం

శ్రీ అరవిందాశ్రమం ఒక ఆధ్యాత్మిక ప్రయోగశాల. కానీ శ్రీమా త ఆశించిన లక్ష్యానికి ఇంత మాత్రం సరిపోదు. అందువల్ల ”ఆరోవిల్లి”(ఉదయపురి) అనే అంతర్జాతీయ ఆధ్యాత్మిక నగరానికి అమ్మ రూపకల్పన చేశారు. శ్రీ మాతా చిన్న నాటి దివ్య స్వప్న రూప కల్పనే ఆరోవిల్లి. అలాగే శ్రీ అరవిందుల ఐదుస్వప్నముల యందు సర్వ మానవ సమైక్య త ఒక స్వప్నం. అది ఆరోవిల్‌ అంతర్జాతీయ నగ రంలో నెరవేరుతుంది. శ్రీ అరవిందుల కార్యసిద్ధికి, తన దివ్య స్వప్నానికి, ఆరోవిల్లి ప్రతీకగా శ్రీ మాత దర్శించారు.
శ్రీ మాతా సందేశం

‘ఆరోవిల్లి’ ఏ ఒక్కరికీ చెందినది కాదు. ఇది యావత్తు మానవ జాతికి చెందినది. అయితే ఆరోవిల్లిలో నివసించాలంటే దివ్య చైతన్యోపాసకుడు కావాలి. భౌతిక, ఆధ్యాత్మిక పరిశోధనలకు ఆట పట్టు ఆరోవిల్లి. సర్వ మానవాళి సమైక్యతకు ధైర్యంగా ముందుకు సాగుతుంది ఆరోవిల్లి. ఆధ్యాత్మిక సాధన కేంద్రంగా, ఆధ్యాత్మిక సామూహిక జీవనానికి అనువైనదిగా ఉంటుంది. ఆరోవిల్లిలో జాతి, మత వివక్షతలకు తావు ఉండదు. మానవ జాతిని ఊర్ద్వోన్ము ఖంగా నడిపించే నగరం. భవిష్యత్తులో జన్మించబోయే దివ్య మాన వునికి నివాస స్థలం ఆరోవిల్లి.
ఆరోవిల్లి నగర జీవనం – విశిష్టత

ఈ ప్రభాత నగరిలో ప్రపంచ నలుమూలల నుండి వచ్చే 50 వేల మంది నివాసం ఉండవచ్చు. ఇది పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆరోవిల్లి నివాస ప్రాంతం నాలుగు భాగాలుగా విస్తరించి ఉంటుంది. పారిశ్రామిక విభాగము, సాంస్కృతిక విభాగము, నివాస క్షేత్రము, అంతర్జాతీయ విభాగముగా విభాజి తమై ఉంటుంది. ఇది నిరంతర కర్మ కౌశల్యంతో రూపు దిద్దుకుం టున్న నగరం. వనములు, వ్యవసాయ క్షేత్రములు, గృహ సముదా యాలు ఏర్పాటు చేయబడినాయి. భిన్న దేశీయులూ, విభిన్న సం స్కృతులూ కలిగిన ప్రజానీకం ఆరోవిల్‌ ఆదర్శానికి అనుగుణంగా వివిధ కార్యాలలో నిమగ్నమై ఉంటారు. ఆరోవిల్లిలో ప్రస్తుతం 54 దేశాల నుండి వచ్చిన సుమారు 2,700 మంది వరకు నివాసం వుంటున్నారు. యువతకు, పెద్దలకు ఇచ్చట నిరంతరము అనేక విషయాలపై జాతీయ, అంతర్జాతీయ వర్క్‌ షాప్‌లు జరుగుతున్నా యి. ఇచ్చటి హరితవనాలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, వాస్తు శిల్ప నైపుణ్యం అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. ఆత్మ భావ ముపై ఆధారపడిన నగరం ఆరోవిల్లి. ఇక్కడ ఉన్నవారంతా దీని ఉన్నతిలో భాగస్వాములే. వివిధ దేశాల ఆచార వ్యవహారాలు, ఆహార నియమాలు యథాతథంగానే కొనసాగుతాయి. తమ గుణ గణాలను అనుసరించి, శక్తిసామర్ధ్యాలకు అనుగుణంగా వ్యవసా యం, వాణిజ్యం, పరిశ్రమలు, శిల్పకళ, విద్య, ఇత్యాది రంగాలలో పాల్గొని పనులను నిర్వహిస్తారు. ఈ ప్రదేశానికి ఇప్పటివరకు ఏ విధమైన నియమాలు అవసరమో అవి రూపొందుతాయని శ్రీ మాత భవిష్య ప్రణాళికలను అందించారు. శ్రీ మాతారవిందుల జీవనం అనేకమైన దివ్య మలుపులతో సాగినది. విశ్వ మానవాళిని పురోభివృద్ది దిశగా అనూహ్యమైన మలుపులు తిప్పింది. అఖండ భారత ఆవిర్బావము, సర్వ మానవ సౌభ్రాతృత్వం, దేవ సంఘాల నిర్మాణం, భారత దేశం ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మక గురువు కాగలదని, దేశ భాష సంస్కృతం విశ్వ భాషగా విస్తృతి నొందగలదని, ఆరోవిల్లి పాస్‌ పోర్టులేని నగరంగా రూపొంది ప్రపంచ దేశాలకు కేంద్ర బిందువు అవుతుందని, అతీం ద్రియ మానవుని ఆగమనం, అతి మానస ఉషోదయం, భువిపై భవిష్యత్తులో ప్రపంచం దర్శించబోయే పరమాద్భుత సత్యాలు.

– కవితా శ్రీధర్‌, 9395511193

Advertisement

తాజా వార్తలు

Advertisement