మనమంతా మన లోపాలు బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ…. తమ ప్రజ్ఞ గురించి గొప్పలు చెబుతూ… పొంగిపోతుంటాం.
తమ కుటిలత్వంతో తేనె పలుకులు పలికి, అజ్ఞా నాన్నీ పండిత వేషధారణ ముసుగులో దాస్తుంటాం.
మెరిసేదంతా బంగారం కాదు. ఒక్కోసారి గాజు ముక్కలుకూడా వజ్రంలా కనిపిస్తాయి. అందుకే దేన్నీ గుడ్డిగా నమ్మవద్దంటారు పెద్దలు. అలాగని దేన్ని నమ్మకుండా జీవించలేం. మనకు నమ్మకం కలిగించ గల కారణాలను చాలా జాగ్రత్తగా గమనించాలి.
నమ్మకం ద్రోహం చేయడం ద్రోహులకు వెన్నతో పెట్టిన విద్య.వీళ్ళని ఓ కంట జాగ్రత్తగా గమనిద్దాం.
నమ్మకంగా నటిస్తూ విషం వెదజల్లే ద్రోహు లెం దరో… మహాభారతంలో శకుని పాత్ర, శత్రువులతో చేతులు కలిపిన జయచంద్రుడిలాంటి చారిత్రక ద్రోహుల గాథా అలాంటివే.
ఈ సమాజంలో నమ్మకద్రోహులు, నయవంచ కులు, ప్రచ్ఛన్నంగా అందమైన ఎన్నో రూపాలలో కని పిస్తారు. పాము కోరల్లోనే విషం కానీ వీరికి నిలువెల్లా విషమే…
నమ్మకమంటే విశ్వసనీయత.ముందు మన ఆత్మ కు మనం విశ్వసనీయంగా ఉందాం.
మన చర్యలు అన్నింటినీ మనలోని ఆత్మ స్థితు డైన అంతర్యామి మౌనంగా గమనిస్తుంటాడు.
మనం ఇతరులను మోసం చేస్తున్నామంటే… మనల్ని మనం మోసం చేసుకోవడమే….
ఎందుకంటే శరీరాలు వేరైనా… మనందరి ఆత్మ లొక్కటే…. మనం చేసే మోసాలన్నీ మన ఆత్మ వంచనలే.. ప్రతి ఆత్మవంచనకీ.. అపరాధ శిక్షలు తప్పవు. మన తప్పుల ప్రక్షాళన కోసం…. నిత్యం స్నానం చేసి మన శరీరంపై మురికి తొలగించుకొన్న ట్లు…. మన మనో మాలిన్యాన్ని తొలగించుకోడానికి జప, ధ్యాన, దానం, పరోపకారం, దీనజనసేవ చేద్దాం, ఎందుకంటే వారు ఆత్మ స్వరూపులైన అంతర్యామి కోవెలలే…
మన ఆధ్యాత్మిక జీవనంలో మన మనోమాలి న్యాలను ఆత్మశోధన ద్వారా మనమే శుద్ధి చేసుకుం దాం… అద్దం మన రూపురేఖలను చూపించినట్లు… మన వ్యక్తిత్వ లోపాలను మన ఆత్మ శోధన స్పష్టంగా తెలియజేస్తుంది. మనల్ని మనం తెలుసుకుంటే… నేను ఎవరు అనే ప్రశ్నకు జవాబు లభిస్తుంది.
శ్రీరాముడు ఉపకరణంగా సమస్త లోకానికి పర మాత్మ ప్రసాదించిన ఆచరణీయమైన దివ్యబోధ యోగ వాశిష్టం. వశిష్ట మహర్షి శ్రీరామునికి చేసిన గీతాబోధ (యోగ వాశిష్టం)లోని సారాంశం ఆత్మ శోధన మార్గం.
– చేకూరి భోజిరెడ్డి
9440387979
ఆత్మశోధన
Advertisement
తాజా వార్తలు
Advertisement