Tuesday, October 29, 2024

ఆత్మ తత్వము – అక్షర పరబ్రహ్మము ఓంకారము


కఠోపనిషత్‌లో యమధర్మరాజు నచికేతు నికి ఆత్మతత్వము గురించి విపులంగా వివరించినది చెప్పబడినది. ఆ వివరణ ఏమిటంటే- ఈ ఆత్మ జన్మించదు. మరణించదు. దేని నుం డి ఆత్మ ఉద్భవించదు. ఆత్మ నుండి ఏది ఉద్బ వించ దు. జన్మ లేనిది.. శాశ్వతమైనది అయిన ఈ ఆత్మ తన దేహము హత్యగావింపబడునప్పుడు తా ను చంపబడుట లేదు. ఆత్మ అసంగ స్వభా వ ము కలది. ఆత్మ తత్వము అణువుకంటే అణువ ు గాను, మహత్తుకంటే మహత్తుగాను ప్రతి జీవి హృదయ కుహరము నందు నివసిం చుచున్నది. ఆత్మ కూర్చుని వుండే దూర ముగా వెళుతుంది. పడుకునే సర్వత్ర సంచ రిస్తుంది. ఈ ఆత్మ శరీరము లేనిది. మిక్కిలి గొప్పది, సర్వ వ్యాప్తి కలది. ఆత్మ శబ్ద, స్పర్శ, రూప, రస, గంథ ములు లేనిది. అవ్యయమైనది. ఆంద్యత ములు లేనిది. నిత్యమైనది. పరమైనది. జ్ఞానమునకు (బ్రహ్మకు) ముందు జన్మించిన వాడు, నీకంటే ముందు జన్మించినవాడు పంచ భూ తముల మధ్యనున్నవాడు, బ్రహ్మ తప స్సుచేపుట్టిన వాడు, జలములకంటే పూర్వము సృష్టింపబడిన వాడు, హృదయ కుహరమందు నివసించువాడు అగు ఆత్మను ఎవడు చూచు చున్నా డో అట్టివాడే బ్రహ్మను దర్శిస్తున్నాడు. బొటనవేలు పరిణామము గల పురుషుడు శరీరములో హృదయ మధ్యమున ఉన్నాడు. ఆ పురుషుడు పొగలేని అగ్ని వంటివాడు. సూర్యుడు ఏవిధముగా బాహ్యదృష్టి దోషములచే అంటి బడడో, అట్లే సర్వభూతాన్తరూపుడైన పరమాత్మ బాహ్య ప్రపంచ దోషములచే అంటి బడడు, అతడు సాక్షి మాత్రమే. బృహదారకోపనిషత్‌లో అక్షర పరబ్రహ్మము గూర్చి ఈవిధంగా చెప్పబడినది. అక్షర పరబ్రహ్మ ము నాశరహితమైన అక్షర మందు ఓత ప్రోతమైన ది. స్థూలము కాదు, సూక్ష్మము కాదు, అణువు కాదు, పొట్టిది కాదు, పొడుగుది కాదు, అలోహితము (రక్తము లేనిది), అస్నేహము (చమురు, కొవ్వు లేనిది), అచ్చాయము (నీడ లేనిది), అతమము (వయస్సు, అజ్ఞానము, చీకటి లేనిది) అసంగము (సంగము లేనిది) అరసము (రసము లేనిది), అప్రాణము, అముఖము, అమాత్రము (పరణామము లేనిది) అనంధము, అచక్షువు, అశ్రే తము, అవాక్కు, అమనస్సు, అతేజస్కము ( తేజము లేనిది) అదే ఉన్నది, అది దేనిని తినుట లేదు. దానిని ఎవరును భుజించుట లేదు. అయ్యది దేనికిని భోక్త కాదు. దేనికిని భోజ్యము కాదు. అక్షరమగు వ్యాపక మైన స్వరూపము, అపూర్వమై న ఆతత్వమును తెలియవలెను. ఈ అక్షరము ( ఆత్మ) తానెవ్వరికిని కనిపించక అందరిని చూచును వినబడుకుండి వినును, ఆలోచ నార్హము కాక పోయనను, విచార్హమైనది. తెలియ బడదు. తెలిసి కొనును. ఇది తప్ప మరి ఎవరును చూచువారు లేరు. ఈ సత్య వస్తువు తప్ప ఇంకెవ్వరు వినువారు లేరు. దీనిని విడిచి విచారించువారు లేరు. మరియు తెలియు వారును లేరు. ఈ అక్షరమనే ఆకాశము ఓత ప్రోతమై కల్పింప బడియున్న ఓంకారము పరమ బీజాకరము. బిం దు నాదములకు పైన ఉన్నది. ఆ ప్రణము శబ్దాక్షర ములు క్షీణింపగా నిశ్శబ్దములో పరమ పదముగ నున్నది. ఎవరు అనాహిత చక్రములో వినిపించు శబ్దమును ( ప్రణవమును) విను చున్నారో అట్టి మోహి సంశయము లేని వాడగు చున్నాడు. అకార, ఉకార, మకార, అర్ధ మాత్ర, బిందు, నాద, కళ, కళాతీతములను ఎనిమిది అంగములచే ప్రకాశించునదియు, 4 పాదములు కలిగినదియు, 3 వ్యాహృతులు, 8 స్థానములు కలదియు, 5 గురు అధి దేవతలు కలదియనగు ఓంకారము. హ్రస్వమైన ప్రణవము పాపములను భస్మ మొ నరించును, దీర్ధ ప్రణవము సకల సంపదలను ప్రసా దించును. అర్ధ మాత్రతో కూడిన ప్రణవము మోక్ష ము నొసగును. ఈ విధంగా కఠోరపనిషత్తులో చెప్ప బడిన ఆత్మతత్వము ఓంకారము గురించే, ఆత్మయే ఓం కారము. బృహదారకోపనిషత్‌లో చెప్పబడిన అక్షర పరబ్రహ్మము కూడా ఓంకారము గురించే. ధ్యాన బిందూపనిషత్‌లో చెప్పబడిన ఓంకారము, విశేష ణాలు ఇవే. ఇవే పరమైనది. ధ్యానింపదగిన ధ్యేయ వస్తువు.
– రవికాంత్‌ తాతా
90005 24265

Advertisement

తాజా వార్తలు

Advertisement