ధాత్రి వృక్షం అంటే ఉసిరిక చెట్టు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఉసిరిక చెట్టు మీద కొలువై ఉంటారని విష్ణు పురాణము చెబుతోంది. దేవ దానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు, భూమి మీద పడిన కార ణంగా, ఉసిరి వృక్షం పుట్టిందని మరో కథ ఉంది.
ఉసిరిని భూమాతగా పూజిస్తారు. కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు మీద శ్రీ మహా విష్ణువు ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉసిరిక చెట్టును ధాత్రీ నారాయ ణు డుగా భావన చేస్తూ, కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుకు పూజలు చేయాలని కూడా శాస్త్రాల కధనం.
ఉసిరిక చెట్టు మూలంలో శ్రీహరి, స్కంధంలో రుద్రుడు, ఊర్ధ్వంలో బ్రహ్మ, శాఖలలో సూర్యుడు, ఉప శాఖలలో దేవతలు ఆశ్రయించి ఉంటా రని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఉసిరిక చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువును, ఉసిరిక కాయలతో దీపారా ధన చేసిన వారిని చూడటానికి యమ ధర్మరాజుకు శక్తి చాలదట.
ఉసిరిక చెట్టుకు 8 వైపులా దీపాలు పెట్టి, 8 ప్రదక్షిణలు చేయాలని, ఉసిరిక చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని పెట్టి ఉసిరిక పత్రితో విష్ణువుకి పూజ చేసి వన భోజనం చేయాలని కొందరు పండితులు చెబుతారు.
కార్తిక మాసంలో పవిత్రమైన ఉసిరిక చెట్టు క్రింద ఒక్క పూటైనా భోజ నం చేయాలని హందూ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. లక్ష్మీదేవికి ఉసిరిక చెట్టు యిష్టమైంది కాబట్టి ఉసిరిక చెట్టు క్రింద భోజనం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ప్రజల విశ్వాసం.
ఆదిశంకరులు బిక్షాటనకు వెళ్ళగా, ఇంటిలో ఏమీ లేని అతి పేదరాలైన ఓ గృహణి, తన దగ్గరున్న ఒకే ఒక్క ఉసిరిక కాయను తలుపు చాటు నుంచి ఆది శం కరుల వారి జోలె లోనికి విసిరి వేస్తుంది. ఆ త్యాగానికి సంతసించిన ఆదిశంకరు లు కనకధారాస్తవ స్తోత్రాన్ని ఆశువుగా చదువుతారు. కరుణించిన లక్ష్మీదేవి ఆ యింట బంగారు ఉసిరికాయలు కురిపిస్తుంది.
బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడాన్ని వన భోజనాలు అంటారు. కార్తీక వన భోజనం విశేషమైన ఫలితాన్ని యిస్తుందని,
హోమాలు, పూజ లు, తర్ప ణాలు చేసేటప్పుడు, యి తర సమయాల్లో భోజ నం చేసేటప్పుడు కలిగిన దోషాలను, పాపాత్ముల దుష్ట సంభాషణములు వినటం వలన కలిగిన దోషాలను కార్తిక వన భోజనం పోగొడుతుందని స్కాంద పురాణం
చెబుతోంది.
ఉసిరిక చెట్టు క్రింద సాలగ్రామాన్ని ఉంచి గంధపు ష్పాక్ష తలతో పూజించిన తర్వాత విప్రులను శక్తి కొలది సత్కరించాలి. శాస్త్ర బద్ధంగా వన భోజనం చేయ డం వలన సకల పాపాలు నశించి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని కూడా స్కాంద పురాణ కథ. ప్రకృతి అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది యింటికి తిరిగి వచ్చే ప్రక్రియే వన భోజనం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బలరాముడు గోప బాలకులతో కలిసి, ఉసిరి క మొదలైన వృక్షాలు కల యమునా తీరంలో ఉన్న బృందావనంలో వన భోజ నాలు చేసారని శ్రీ మద్భాగవతం చెబుతోంది.
సూత మహర్షి యితర మునులుతో కలిసి నైమిశారణ్యంలో, కార్తిక పౌర్ణమి నాడు ఉసిరిక చెట్టు క్రింద, వన భోజనాలు చేసినట్లు కార్తీక పురాణం చెబుతోంది.
ఆరోగ్యానికి ఉసిరిక ఎంతో మంచిది. ఉసిరిక ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వృక్షం . రోజూ ఉసిరిక కాయను ఏదో ఓ రూపంలో తినడం ఆరోగ్యానికి మంచిది. జీర్ణక్రియ పెరగడానికి ఉసిరిక దో#హదపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచు తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వృద్ధాప్యం త్వ రగా దగ్గరకు చెెరనీయదు. ఉసిరిక చెట్టు నుంచి వచ్చే గాలి కూడా
శ్రేష్టమైనదే. ఉసిరికకు సాటి అయిన మరో వృక్షం లేదని ”చరక సంహత” చెబుతోంది .ఎక్కువ సేపు ఉసిరిక చెట్టు క్రింద గడపితే మంచిదనే వైద్య కారణ మే, కార్తిక మాసంలో ఉసిరిక చెట్టు క్రింద దీపాలు పెట్టడం, పూజలు చేయడం, వన భోజనాలు చేయడాలు వెనుక దాగున్న అసలు రహస్యం.
అందుకేనేమో ప్రతి మనిషి తన జీవి త కాలంలో కనీసం 5 ఉసిరిక చెట్లు నాటాలంటారు.