రావణాసురుడు గొప్ప శివభక్తుడు, వేదవేదాం గాలను నేర్చుకున్నవాడు. కాంచన లంకకు అధిపతి. అనేక వరములను పొందిన రావణుడు గర్వం తో ముల్లోకాలను గడగడలాడించాడు. అత్యంత సౌం దర్యవతి అయిన మండోదరి భార్యగా ఉండగా స్త్రీ వ్యామోహంతో అనేకమంది కన్యలను, మహిళలను తన మదబలంతో బలవంతంగా ఎత్తుకువచ్చి తన అంత:పురంలో బంధించి అనుభవించాడు. చివరకు సన్యాసిని అయిన వేదవతిని బలాత్కరించబూనగా ఆమె యోగాగ్నిలో భస్మమయింది. తన సోదరుడైన కుబేరునికి కాబోయే కోడలైన రంభను కూడా కామించి బలాత్కారం చేయబూని శాపానికి గురయ్యాడు. అత్యంత రాక్షస స్వభావి అయిన రావణుడు తన పరి వారంతో తమోభోగాలతో రేయింబవళ్ళు సుఖించే వాడు. సర్వ జంతు, పక్షి మాంసాలతో, అనేక రకము లైన మధిరలతో స్త్రీ, పురుష బేధం లేకుండా తిని, త్రాగి కాలముతో పనిలేకుండా మత్తులో పడి ఉండేవారు. చివరికి ఏకపత్నీవ్రతుడైన, ధర్మవ్రతుడైన శ్రీరామచం ద్రుని ధర్మపత్ని సీతాదేవిని అపహరించి ఆయన చేతి లో సకల పరివారంతోసహా నాశనమయ్యాడు.
ుుు
రంభునికి గల పశుప్రవర్తన వలన మహిషాసు రుడు జన్మించాడు. అవసరమైనపుడు తన తల్లి రూప మయిన మహిషముగా మారగల శక్తివంతుడు. ఇతడు కూడా వరగర్వంతో ముల్లోకాలను జయించాడు. సాధువర్తనులను, దేవగణాలను తన పశు ప్రవృత్తితో నానాబాధలు పెట్టసాగాడు. దేవతలు, ఇంద్రుడు చివర కు వరాలను ఇచ్చిన బ్రహ్మ, మహేశ్వరుడు కూడా ఏమీ చేయలేకపోయారు. చివరకు త్రిమూర్తులు సకల దేవ తలు తమతమ దివ్యశక్తులను ఒకటిగా చేసి మహిషాసు రుని సంహరించడానికి పరాశక్తిని సృజించారు. ఆ జగ న్మాత అతిలోక భయంకరిగా మారి మహిషాసుర సంహారానికి ఎదురుచూడసాగింది. తన దూతల ద్వా రా కాముకుడైన మహిషుడు ఆదిపరాశక్తి సౌందర్యాన్ని విని, ఆ సుందరిని తన వద్దకు తీసుకురండని తన సైన్యా ధ్యక్షుని పంపాడు. చివరకు యుద్ధరంగంలో జగన్మాత మాతృకాముకుడైన నీకు జీవించే హక్కులేదని అతి భయంకరంగా అంతంచేసింది.
ుుు
విష్ణుమూర్తి భూమిని హిరణ్యాక్షుని నుండి కాపా డడానికి వరాహ అవతారాన్ని ధరించాడు. భూదేవిని కాపాడిన సందర్భంలో సంధ్యాసమయాన ఆమెకు, వరాహావతారునకు నరకాసురుడు ఉద్భవించాడు. నిషిద్ధ కాలములో అంకురార్పణ జరగడంవల్ల నరకు నికి రాక్షస లక్షణాలు కలిగాయి. ముందు నరకుడు కామాఖ్యకు రాజై చక్కని పరిపాలన చేయసాగాడు. కొంతకాలము తరువాత ప్రక్క రాజ్యానికి రాజైన బాణా సురునితో స్నేహం కుదిరింది. వెయ్యి చేతులు గల బాణా సురుడు బలిచక్రవర్తి కుమారుడు. బాణాసురుడు స్త్రీ లోలుడు. అతని పరస్త్రీ వ్యామోహము నరకాసురునికి సోకింది. వారిరువురు కలసి చేయని అకృత్యములు లేవు. సహవాస దోషముతోను, అంతర్గతంగానున్న అసుర స్వభావంతోను పదహారువేల మంది ఇతర రాజ్యాల రాజకన్యలను, మహిళలను ఎత్తుకువచ్చి బల వంతంగా వివాహ మాడదలచాడు నరకాసురుడు. చివరకు శ్రీకృష్ణ, సత్యభామల చేతిలో హతుడయ్యాడు. సమస్త జనులు సంతసించారు.
ుుు
కాలనేమి మారీచుని కుమారుడు. ఇతని కూతురు పేరు బృంద. ఆమెను జలంధరునికి ఇచ్చి పెళ్ళి చేసాడు. కాలనేమి రావణాసురునికి మిత్రుడు. లక్ష్మణుడు మూర్ఛపోయినపుడు హనుమ సంజీవిని తేవడానికి వెళ్ళాడు. హనుమను దారిలోనే హతమార్చమంటా డు రావణుడు. కానీ హనుమ చేతిలో దారుణంగా బలి అయ్యాడు కాలనేమి.
ుుు
సోమరిపోతు బకాసురుడు ఏకచక్రపుర అగ్రహార సమీపాన గల కొండ గుహలలో నివాసముంటూ రోజు కొక మనిషిని, బండెడు అన్నము, రెండు దున్నపోతు లు, అనేక ఆహార పదార్థములు సమర్పించే ఒప్పందం చేసుకున్న రాక్షసుడు. అరణ్యవాస కాలములో పాండ వులు అదే అగ్రహారంలో నివాసమున్నారు. ఒక బ్రాహ్మ ణుని ఇంటిలో ఆశ్రయం పొందారు. ఒకరోజు బకాసురు నికి ఆహారం పంపే వంతు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. కుటుంబమంతా విషాదంలో మునిగిపో యింది. అతని ఒక్కగానొక్క కొడుకు బండిపై ఆహారం గా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అంత కుంతీదేవి ఆశ్రయ మిచ్చిన ఆ కుటుంబ క్షేమం కొరకు భీముణ్ణి బండిపై పం పింది. భీముడు సోమరిపోతైన బకాసురుణ్ణి నుగ్గు నుగ్గు చేసి ఏకచక్రపుర వాసులను కాపాడాడు.
ుుు
భస్మాసురుడు శివుని గురించి తపస్సు చేసి తాను ఎవరిమీద చేయివేస్తే వాళ్ళు భస్మం అవ్వాలని వరం పొందాడు. తపస్సుకు ఫలంగా వరమివ్వడం దైవ ధర్మం. ఆవిధంగా అనేకమంది రాక్షసులు వరాలు పొం ది కుటిల బుద్ధితో వరమిచ్చిన దైవాన్నే అంతం చేయ బూనారు. చివరికి భస్మాసురుడు శివుడి నెత్తిన చేయి పెట్ట ప్రయత్నించాడు. కష్టకాలంలో ఆదుకొనే విష్ణువు మోహిని అవతారమెత్తి భస్మాసురుని హస్తం అతని నెత్తి న పెట్టే విధంగా యుక్తి పన్ని అంతం చేసాడు.
యుగయుగాల నుండి రాక్షసులు పుడుతూ అం తం అవుతూ ఉన్నారు. సృష్టిని కాపాడే సత్త్వగుణ ప్రధా నులను రక్షించే బాధ్యత ధర్మరక్షకుడైన నారాయణుని ది. అరణ్యంలో అటవిక న్యాయం, సముద్రాలలో జల న్యాయం ప్రకృతి నియమం. మానవ సమాజంలో సృ ష్టి ధర్మమును అనుసరిస్తూ మానవత్వ న్యాయాన్ని అనుసరించాలి. దానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు ఎవ రైనా అసురునిగానే పరిగణించాలి. యుగధర్మానికి భం గం కలిగించేవారు రాక్షసులే! ఇతరుల జీవన విధానా నికి, శ్రమకు, కుటుంబానికి, సంపదకు ఆటంకం కలిగిం చి దోపిడి చేసేవారు దానవులుగా పరిగణించబడి అం తం చేయబడతారు. స్వధర్మాన్ని పాటిస్తూ ఇతరులను నొప్పించకుండా, తోచిన సహాయం చేసేవారు ధర్మపరు లు. అటువంటి వారికి హాని తలపెట్టేవారు అసురులు. ధర్మదేవత అటువంటి వారిని అంతం చేయడం ఖా యం. అందుకే మానవునిగా మసలుకుందాం.
అసుర సంహారమే యుగధర్మం
Advertisement
తాజా వార్తలు
Advertisement